Bathukamma : ఎంగిలి పూల బతుకమ్మ వెనుక ఉన్న కథలు..ప్రత్యేక నైవేద్యాలు

బతుకమ్మ సంబురాలు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డలు పూలపండుగతో సందడి చేయనున్నారు.ఎక్కడెక్కో పూసిన పూలు ఓ దగ్గరకు చేరి బతుకమ్మలో ఇమిడిపోతాయి.

Bathukamma : ఎంగిలి పూల బతుకమ్మ వెనుక ఉన్న కథలు..ప్రత్యేక నైవేద్యాలు

Engili Pula Batukamma

engili pula bathukamma 2021 : నేటి నుంచి బతుకమ్మ సంబురాలు ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డలు పూల పండుగతో సందడి చేయనున్నారు. ఎక్కడెక్కో పూసిన పూలు ఓ దగ్గరకు చేరతాయి. రంగు రంగుల్లో మురిసిపోతాయి. బతుకమ్మ అంటే ఆడబిడ్డల పండుగు. బతుకమ్మ అంటే ప్రకృతి పండుగ. పువ్వుల్లాంటి ఆడబిడ్డలు ప్రకృతి ఒడిలో పూసిన పూలతో చేసుకునే సంబురం బతుకమ్మ పండుగ. అదే కదా.. బతుకమ్మ సంబురం. బుధవారం ఎంగిలిపూల బతుకమ్మతో ఈ వేడుకలకు తెరలేచాయి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాలతో చెరువులు, కుంటలు నీటితో నిండిపోయాయి. సాయంత్ర బతుకమ్మలతో ఆటలాడిన పడుచులు బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేస్తారు.

పూల పండుగలోని ప్రత్యేకత..
దైవాన్ని పూలతో పూజిస్తాం. కానీ పూలనే దైవంగా భావించి ఆరాధించడమే బతుకమ్మ పండుగ ప్రత్యేకత. తెలంగాణ ఆడబిడ్డల సంబురం బతుకమ్మ పండుగ.. ఎంగిలిపూల వేడుకతో నేడు మొదలైంది. పండుగ కోసం పుట్టిళ్లకు చేరిన ఆడపడుచులతో.. చదువు, ఉద్యోగాల పేరుతో ఇంటికి దూరంగా వెళ్లిన వారి రాకతో రాష్ట్రంలో ప్రతి ఇంటా సందడి మొదలైంది. ఎంగిలిపూలతో ప్రారంభమైన ఈ సంబురం తొమ్మిదో రోజున సద్దుల బతుకమ్మ ఉత్సవంతో ముగుస్తుంది.ఆడబిడ్డలంతా తమ పుట్టిళ్లకు చేరుకుని తొమ్మిది రోజులపాటు బతుకమ్మ సంబురాలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఆడపడచుల రాకతో ప్రతి ఇంటా కోలాహలం మొదలైంది. చదువుల కోసం పొరుగు ప్రాంతాలకు వెళ్లిన ఆడబిడ్డలు ఈ బతుకమ్మ పండుగకు ఇంటికి చేరుకుంటారు. బంధువులు, స్నేహితులతో పల్లెలన్నీ కళకళలాడుతున్నాయి.

Read more :Bathukamma: ప్రకృతిని అరాధించే వేడుక..బతుకమ్మ పండుగ షురూ..

తొమ్మిది రోజుల పాటు జరిగే బతుకమ్మ వేడుకల్లో మొదటి రోజు ఎంగిలిపూలు. ఈ ఎంగిలి పూల బతుకమ్మ మహాలయ అమావాస్య రోజున మొదలవుతుంది. దీన్ని పెత్రామాస అని కూడా అంటారు. రాష్ట్రంలో ప్రతి ఆడపడుచు బతుకమ్మను స్వయంగా పేరుస్తుంది. వివిధ రకాల పూలతో.. భక్తిశ్రద్ధలతో.. పేరుస్తారు.ఎంగిలిపూల బతుకమ్మ అనే పేరు రావడానికి పెద్దవారు రక రకాల కథలు చెబుతుంటారు.

మొదటి కథ…
బతుకమ్మను పేర్చేటప్పుడు ఆ పూలకాడలను చేతులతో సమానంగా చించి వేస్తారు. కత్తితో కోసినా.. నోటితో కొరికనా ఆ పూలు ఎంగిలి అయినట్లు భావిస్తారు. పూర్వకాలంలో కొందరు మహిళలు నోటితో కొరికి బతుకమ్మ పేర్చడం వల్ల అప్పటి నుంచి పెత్రామాస రోజు ఆడే బతుకమ్మకు ఎంగిలిపూల బతుకమ్మ అనే పేరు వచ్చినట్లు చెబుతున్నారు.

Read more :Raamayanam : ఆ రావణుడు ఇక లేడు..

మరోకథ ఏంటంటే..
మొదటి రోజున బతుకమ్మను పేర్చడానికి ముందు రోజు రాత్రే పువ్వులు తీసుకొని వస్తారని.. ఆ పూలతో బతుకమ్మను పేర్చడం వల్ల ఎంగిలిపూల బతుకమ్మ అనే పేరువచ్చినట్లు ప్రతీతి. కొన్ని ప్రాంతాల్లో తిన్న తరువాత కూడా బతుకమ్మ పేరుస్తారని అందుకే ఆ పేరు వచ్చిందని చెబుతారు.

ఎంగిలిపూల రోజున బతుకమ్మను పేర్చి.. సాయంత్రం స్నేహితులు, బంధువులతో కలిసి ఆడబిడ్డలంతా పాటలు పాడుతు ఆటలాడుతారు. బతుకు దెరువు చెప్పే బతుకమ్మ పాటలన్నీ పాడుతూ ఆ పాటల వారసత్వాన్ని తర్వాత తరాలకు పంచుతుంటారు. ఈ పాటల్లో పంటలు సమృద్ధిగా పండాలని వరుణ దేవుణ్ని ప్రార్థిస్తారు. ప్రతి ఇంటా పాడిపంటలతో సుఖసంతోషాలు వెల్లివిరవాలని కోరుకుంటారు. అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ములు, తండ్రీపిల్లు ఇలా అన్ని బంధాల విలువలు తెలిపే రకరకాల పాటలు పాడుతుంటారు. ఎంగిలిపూల రోజున నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. ఇలా తొమ్మిది రోజులు ఒక్కోరోజు ఒక్కో నైవేద్యాన్ని సమర్పిస్తారు.చీకటి పడే వరకు మహిళలంతా బతుకమ్మ ఆడుకుని.. చీకటిపడుతోందనగా.. బతుకమ్మలను తలపై పెట్టుకుని ఊళ్లో ఉన్న చెరువువైపు ఊరేగింపుగా బయల్దేరుతారు.

పాటలు పాడుతూ బతుకమ్మను గంగమ్మ ఒడికి చేరుస్తారు. తర్వాత ఇంటి నుంచి తీసుకొచ్చిన నైవేద్యాన్ని గౌరమ్మకు నైవేద్యంగా సమర్పించి.. ఒకరికొకరు పంచిపెట్టుకుంటారు. బతుకమ్మ పేర్చిన ఖాళీ షిబ్బి, తాంబాలంతో పాటలు పాడుకుంటూ.. బతుకమ్మను గుర్తు తెచ్చుకుంటూ తిరిగి రేపు మళ్లీ వస్తామని చెబుతూ ఇళ్లకు చేరతారు ఆడబిడ్డలు.

ఎంగిలి పూల బతుకమ్మ ప్రత్యేక ప్రసాదాలు..

మహాలయ అమావాస్య రోజున ఎంగిలిపూల బతుకమ్మతో పూల పండుగ సంబురాలు ప్రారంభమవుతాయి. మొదటి రోజున ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన సంబరంలో ప్రసాదాలు ప్రత్యేకమైనవి.  తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యంగా పెడతారు.