BCCI Central Contracts: పాపం.. తెలుగు కుర్రాడు హనుమ విహారి సహా ఆరుగురికి చోటు దక్కలేదు..

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్స్ జాబితాలో పూర్తిగా చోటు దక్కించుకోని ఆటగాళ్లూ ఉన్నారు. వారిలో తెలుగు కుర్రాడు హనుమ విహారి కూడా ఉన్నాడు. భువనేశ్వర్ కుమార్, అజింక్యా రహానె, ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ సాహా, దీపక్ చాహర్, హనుమ విహారికి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్స్ జాబితాలో చోటు దక్కలేదు.

BCCI Central Contracts: పాపం.. తెలుగు కుర్రాడు హనుమ విహారి సహా ఆరుగురికి చోటు దక్కలేదు..

BCCI Central Contracts

BCCI Central Contracts: బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్స్ లో కొందరు ఆటగాళ్లకు చోటు దక్కలేదు. బీసీసీఐ తాజాగా టీమిండియా సెంట్రల్ కాంట్రాక్ట్స్ 2022-23 ప్రకటిచిన విషయం తెలిసిందే. ఇందులో రవీంద్ర జడేజా తన గ్రేడును మెరుగుపర్చుకుని “ఏ” ప్లస్ జాబితాలో చేరడం, కేఎల్ రాహుల్ వంటి కొందరు ఆటగాళ్లు గ్రేడును కాస్త కోల్పోయి గ్రేడ్ “బీ”లో చేరడం వంటి పరిణామాలు జరిగాయి. అయితే, బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్స్ జాబితాలో పూర్తిగా చోటు దక్కించుకోని ఆటగాళ్లూ ఉన్నారు. వారిలో తెలుగు కుర్రాడు హనుమ విహారి కూడా ఉన్నాడు.

భువనేశ్వర్ కుమార్, అజింక్యా రహానె, ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ సాహా, దీపక్ చాహర్, హనుమ విహారికి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్స్ జాబితాలో చోటు దక్కలేదు. ఈ ఆటగాళ్లకు జాతీయ జట్టులో చోటు కూడా దక్కడం లేదు. దీపక్ చాహర్ బాగానే రాణిస్తున్నప్పటికీ గాయం కారణంగా అతడికి జట్టులో చోటు దక్కడం లేదు.

టెస్టు స్క్వాడ్ లో హనుమ విహారి ముఖ్యమైన ఆటగాడిగా ఉన్నప్పటికీ అతడికి తుది జట్టులో స్థానం దక్కడం లేదు. దీపక్ హూడా, అర్ష్ దీప్ సింగ్, కేఎస్ భరత్ వంటి ఆటగాళ్లకి కనీసం గ్రేడ్ ‘సీ’లోనైనా చోటు దక్కింది. గ్రేడ్ ‘సీ’లోనే శిఖర్ ధావన్ కూడా ఉండడం అభిమానులను ఆశ్చర్యపర్చింది.

అతడి స్థానంలో టీమిండియాలో శుభ్ మన్ గిల్ ను సెలెక్టర్లు ఎంపిక చేస్తున్నారు. గ్రేడ్ ‘సీ’ ఉమేశ్ యాదవ్, శిఖర్ ధావన్, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్, దీపక్ హూడా, చాహెల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, అర్ష్ దీప్ సింగ్, కేఎస్ భరత్ ఉన్నారు. భువనేశ్వర్ కుమార్, అజింక్యా రహానె, ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ సాహా, దీపక్ చాహర్, హనుమ విహారికి గ్రేడ్ సీలోనూ చోటు దక్కలేదు.

IPL-2023: చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు చేదు వార్త.. బౌలింగ్ కు దూరమైన బెన్ స్టోక్స్