Pushpa2: పుష్ప రాజ్ కోసం కష్టపడుతున్న బుచ్చిబాబు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డును క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈసారి పాన్ ఇండియా స్థాయిలో సుకుమార్ పుష్ప2 చిత్రాన్ని ప్లాన్ చేస్తుండటంతో స్క్రిప్టు విషయంలో అన్ని అంశాలు పక్కాగా ఉండేలా జాగ్రత్తపడుతున్నాడు. తాజాగా బుచ్చిబాబు సానా సుకుమార్‌కు పుష్ప2 స్క్రిప్టు విషయంలో సాయం చేస్తున్నాడు.

Pushpa2: పుష్ప రాజ్ కోసం కష్టపడుతున్న బుచ్చిబాబు

Buchi Babu Helping Sukumar With Pushpa2 Script

Pushpa2: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డును క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కించగా, ఈ సినిమాలో బన్నీ ఊరమాస్ అవతారంలో చేసిన పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఈ సినిమాలో బన్నీ పాత్రకు ప్రేక్షకులు ఫిదా అవ్వడంతో సీక్వెల్ సినిమా ఎప్పుడెప్పుడు తెరకెక్కుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Pushpa2: ఏందిరా సామీ.. ఎక్కడ దొరుకుతాయి మీకు అంటోన్న మనోజ్!

అయితే ఈసారి పాన్ ఇండియా స్థాయిలో సుకుమార్ పుష్ప చిత్రాన్ని ప్లాన్ చేస్తుండటంతో స్క్రిప్టు విషయంలో అన్ని అంశాలు పక్కాగా ఉండేలా జాగ్రత్తపడుతున్నాడు. అందుకే ఇంకా ఈ సీక్వెల్ మూవీని పట్టాలెక్కించలేదు. అయితే సుకుమార్ పుష్ప 2 కోసం చేస్తున్న హార్డ్ వర్క్ అంతా ఇంతా కాదని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయనకు పలువురు సాయం కూడా చేస్తున్నారట. సుక్కు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి, ‘ఉప్పెన’ చిత్రంతో డైరెక్టర్‌గా మారి సక్సెస్ అందుకున్న బుచ్చిబాబు సానా, తాజాగా సుకుమార్‌కు పుష్ప2 స్క్రిప్టు విషయంలో సాయం చేస్తున్నాడు.

Pushpa2: పుష్ప రాజ్‌ను ఢీకొట్టేందుకు మరో బాలీవుడ్ యాక్టర్..?

వీరిద్దరు కలిసి స్క్రిప్టు విషయంలో చర్చించుకుంటున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక పుష్ప2 సినిమాను పుష్పకు రెండింతలు గ్రాండ్‌గా తీసేందుకు సుకుమార్ అండ్ టీమ్ రెడీ అవుతోంది. కాగా ఈ సినిమాలో బన్నీ మరోసారి తనదైన పర్ఫార్మెన్స్‌తో సినిమాను క్యారీ చేయనుండగా, ఈసారి మరికొన్ని కొత్త పాత్రలు మనకు కనిపిస్తాయని చిత్ర వర్గాలు అంటున్నాయి.