Kidambi Srikanth : చరిత్ర సృష్టించిన తెలుగు తేజం.. వరల్డ్ చాంపియన్‌షిప్ ఫైనల్లో కిదాంబి శ్రీకాంత్

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ మెన్స్ సింగిల్స్ లో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీలో శ్రీకాంత్ ఫైనల్ చేరాడు.

Kidambi Srikanth : చరిత్ర సృష్టించిన తెలుగు తేజం.. వరల్డ్ చాంపియన్‌షిప్ ఫైనల్లో కిదాంబి శ్రీకాంత్

Kidambi Srikanth

Kidambi Srikanth : స్పెయిన్ లోని హుఎల్వా వేదికగా జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ మెన్స్ సింగిల్స్ లో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీలో శ్రీకాంత్ ఫైనల్ చేరాడు. మరో భారత ప్లేయర్ లక్ష్యసేన్ తో జరిగిన సెమీస్ లో 17-21, 24-14, 21-7 పాయింట్ల తేడాతో శ్రీకాంత్ గెలిచాడు. వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ఫైనల్ చేరిన తొలి భారత పురుష ఆటగాడిగా శ్రీకాంత్ రికార్డు సృష్టించాడు.

Corona Pfizer : అప్పటివరకు కరోనా అంతం కాదు..! షాకింగ్ విషయం చెప్పిన ప్రముఖ ఫార్మా కంపెనీ

సెమీస్ లో ఇరువురి మధ్య మ్యాచ్ హోరాహోరీగా సాగింది. యువ ఆటగాడు లక్ష్యసేన్‌ను శ్రీకాంత్ ఓడించాడు. కాగా, ఒకే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఇద్దరు భారత పురుష షట్లర్లు సెమీస్‌ చేరడం ఇదే తొలిసారి. దీంతో ఇప్పటికే భారత్‌కు రెండు పతకాలు ఖాయమయ్యాయి. ఇక సెమీఫైనల్‌లో ఓడిపోవడంతో లక్ష్యసేన్‌కు కాంస్యం దక్కగా, కిదాంబి స్వర్ణం కోసం పోరాడనున్నాడు.

ఫైనల్‌లో గెలిస్తే కిదాంబి సరికొత్త చరిత్ర సృష్టిస్తాడు. కాగా, పురుషుల విభాగంలో 1983లో ప్రకాశ్‌ పదుకొనె, 2019లో సాయిప్రణీత్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సెమీస్‌ చేరి కాంస్యం దక్కించుకున్నారు.

Best Foods : రన్నింగ్, జాగింగ్ చేసే వారికి బెస్ట్ ఫుడ్స్ ఇవే…

శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్ లో కిదాంబి శ్రీకాంత్.. మాజీ ప్రపంచ ఛాంపియన్, డచ్ ఆటగాడు మార్క్ కల్జౌను 21-8, 21-7 తేడాతో ఓడించాడు. కేవలం 26 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మార్క్ ను చిత్తు చేశాడు కిదాంబి శ్రీకాంత్. దీంతో సెమీస్ కు చేరి పతకం ఖాయం చేసుకున్నాడు.

కాగా ఈ టోర్నీలో మరో తెలుగు తేజం పీవీ సింధు పోరాటం క్వార్టర్స్ లోనే ముగిసింది. మహిళల సింగిల్స్ క్వార్టర్స్ లో తైపీ షట్లర్‌ తైజుయింగ్ చేతిలో 21-17, 21-13 తేడాతో సింధు ఓటమి చెందింది.