Coronavirus: జూన్‌లో తెలంగాణలో గరిష్ట స్థాయికి కొవిడ్ కేసులు.. ఆరోగ్యశాఖ అంచనా ప్రకారం..

తెలంగాణ రాష్ట్రంలో జూన్ నెలలో కొవిడ్ కేసుల తీవ్రత గరిష్ట స్థాయికి పెరిగే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేస్తోంది. జనాభాలో 10శాతం మంది కొవిడ్ భారినపడే అవకాశముందట. ఏప్రిల్ మొదటి వారంలో...

Coronavirus: జూన్‌లో తెలంగాణలో గరిష్ట స్థాయికి కొవిడ్ కేసులు.. ఆరోగ్యశాఖ అంచనా ప్రకారం..

Covid Testing

Coronavirus: తెలంగాణ రాష్ట్రంలో జూన్ నెలలో కొవిడ్ కేసుల తీవ్రత గరిష్ట స్థాయికి పెరిగే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేస్తోంది. 10శాతం మంది కొవిడ్ భారినపడే అవకాశమున్న వారు మూడు కేటగిరిల వారిగా ఉన్నారని తెలిపింది. ఏప్రిల్ మొదటి వారంలో ప్రతి లక్ష జనాభాకు యాక్టివ్ కేసుల కేవలం 276మాత్రమే కాగా, గడిచిన పది రోజుల్లో పాజిటివిటీ రేటు 0.15శాతం నుంచి 0.30శాతంకు పెరిగిందని అధికారులు పేర్కొంటున్నారు. అధికారుల అంచనా ప్రకారం.. జనాభాలో మూడు ప్రధాన కేటగిరిలుగా విభిజిస్తే.. ఇంకా వైరస్ బారిన పడని వారు, ఇంకా ముందు జాగ్రత్తలు తీసుకోని వారు, మూడవ కేటగిరి వృద్ధులుగా తీసుకున్నారు. మొదటి కేటగిరిలో 7శాతం మంది, 3శాంతం మంది రెండు, మూడవ కేటగిరి కిందకి వస్తారు. ముందు జాగ్రత్త తీసుకోనివారు, ధీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న వృద్ధులకు కొవిడ్ వ్యాప్తి ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటుంది.

Telangana Covid : తెలంగాణలో కరోనా.. కొత్త కేసులు

మరోవైపు తెలంగాణ జనాభాలో సగటున 93శాతం మందికి యాంటీబాడీలు కలిగి ఉన్నారని రాష్ట్ర సెరో సర్వైలెన్స్ సర్వే వెల్లడించింది. కానీ నిజామాబాద్, సిద్దిపేట జిల్లాల్లోని జనాభాలో 90శాతం కంటే తక్కువ మందిలో యాంటీబాడీలు ఉన్నాయని, వారికి కొవిడ్ సోకే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రంలో ప్రస్తుత కొవిడ్ తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ, సానుకూలత రేటు పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఏప్రిల్ 10న పాజిటివి రేటు 0.15 శాతం ఉండగా, ఏప్రిల్ 22న 0.22శాతం, ఏప్రిల్ 25న 0.26శాతం, ఏప్రిల్ 27న 0.33శాతంకు పెరిగింది. ఇదిలానే పెరిగితే జూన్ నాటికి రాష్ట్రంలో కొవిడ్ పాజిటివిటీ రేటు 10శాతంకు పెరిగే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో లక్ష జనాభాకు 29 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. కరీంనగర్, హైదరాబాద్ దాని చుట్టుపక్కల జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో యాక్టివ్ కేసుల సంఖ్య పెద్దగా లేదు. కానీ ప్రతీ ఒక్కరూ బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ పెట్టుకొని వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు.

Telangana Corona Update : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..

తెలంగాణలో శనివారం 34 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. వాటిలో 26 హైదరాబాద్‌లో నమోదయ్యాయి. సానుకూలత రేటు 0.2% నుండి 0.33%కి పెరిగింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,92,012కి చేరుకుంది. మరణాల సంఖ్య శనివారం నాటికి 4,111కి చేరుకుంది. మొత్తం 20 మంది రోగులు కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 7,87,581కి చేరుకుంది. ప్రస్తుతం 320 మంది రోగులు చికిత్సపొందుతున్నారు. ప్రస్తుతం రికవరీ రేటు 99.44% ఉండగా, మరణాల రేటు 0.51%గా ఉంది.