Corona Fourth Wave Tension : దేశంలో మళ్లీ కరోనా అలజడి.. కమ్ముకుంటున్న ఫోర్త్‌వేవ్ భయాలు

దేశంలో మళ్లీ కరోనావైరస్ మహమ్మారి అలజడి మొదలైంది. మహమ్మారి మరోసారి పుంజుకుంటోంది. కొన్ని రాష్ట్రాల్లో క్రమంగా పెరుగుతున్న కేసులు.. భయాందోళనకు గురి చేస్తున్నాయి.

Corona Fourth Wave Tension : దేశంలో మళ్లీ కరోనా అలజడి.. కమ్ముకుంటున్న ఫోర్త్‌వేవ్ భయాలు

Fourth Wave Tension

Corona Fourth Wave Tension : దేశంలో మళ్లీ కరోనావైరస్ మహమ్మారి అలజడి మొదలైంది. మహమ్మారి మరోసారి పుంజుకుంటోంది. కొన్ని రాష్ట్రాల్లో క్రమంగా పెరుగుతున్న కేసులు.. భయాందోళనకు గురి చేస్తున్నాయి. పది రోజుల ముందు వరకు 2వేలకు అటు ఇటుగా ఉన్న కేసుల సంఖ్య ఇప్పుడు మళ్లీ 4వేలు దాటింది. 24 గంటల్లో దేశంలో 4వేల 270 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

జూన్ చివరి నాటికి ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్న సైంటిస్టుల అంచనాలు నిజం చేస్తూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా కరోనాకు కేరాఫ్ గా నిలిచే మహారాష్ట్రలో కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. అటు సౌతిండియా కరోనా హాట్ స్పాట్స్ లో ఎప్పుడూ ముందుండే కేరళలోనూ సేమ్ సీన్ కనిపిస్తోంది. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ సమయంలోనూ ముందుగా ఈ రాష్ట్రాల్లోనే కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఆ తర్వాత మిగిలిన రాష్ట్రాల్లో కరోనా కేసులు కల్లోలం సృష్టించాయి. ఇప్పుడు మళ్లీ అదే తరహా సీన్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.(Corona Fourth Wave Tension)

Covid in India..Mask must : భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు..ఆ రాష్ట్రంలో మళ్లీ మాస్కు నిబంధన తప్పనిసరి

మహారాష్ట్రలో మరోసారి కరోనా విజృంభణ మొదలైంది. అక్కడ ఒక్కరోజే 1300లకు పైగా కేసులు నమోదయ్యాయి. దాదాపు మూడు నెలల తర్వాత భారీ స్థాయిలో కేసులు నమోదు కావడం కలకలం సృష్టిస్తోంది. నిన్న నమోదైన కేసుల్లో ఒక్క ముంబైలోనే 889 కేసులు నమోదయ్యాయి. నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ లో 104 కొత్త కేసులు నమోదయ్యాయి. కేసులతో పాటు మరణాలు కూడా నమోదు కావటం ఆందోళన కలిగిస్తోంది.

దీంతో రాష్ట్రలో బహిరంగ ప్రదేశాల్లో మాస్కు పెట్టుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆడిటోరియంలు, స్కూళ్లు, కాలేజీలు లాంటి ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు. అయితే, మాస్కు ధరించనంత మాత్రాన ఎవరిపైనా చర్యలు తీసుకోబోమని, కానీ, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మాస్కు పెట్టుకోవడం శ్రేయస్కరం అన్నారు. అలాగే టెస్ట్, ట్రాకింగ్, ట్రీట్ మెంట్లను వేగవంతం చేయాలని సూచించారు.

Covid booster : కార్బెవాక్స్‌ వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోస్‌.. డీసీజీఐ అనుమతి..

ఒక్కరోజు వ్యవధిలో మరో 15 మంది కొవిడ్ తో చనిపోయారు. ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 5,24,692కు చేరింది. శనివారం మరో 2వేల 619 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 4.26 కోట్లు దాటింది. ఆ రేటు 98.73 శాతంగా కొనసాగుతోంది. కొన్ని రోజులుగా రికవరీల కంటే కొత్త కేసులు ఎక్కువగా ఉంటుండటంతో యాక్టివ్ కేసులు క్రమంగా పెరుగుతూ 24 వేలు దాటాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 24,052 (0.06%) యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. నిన్న 11,92,427 మంది టీకాలు వేయించుకోగా.. ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 194 కోట్లు దాటింది.

దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అలర్ట్ చేశారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని, మాస్కు తప్పనిసరిగా ధరించాలని ఆయన సూచించారు. గుంపులు గుంపులుగా తిరగొద్దని కోరారు. వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే టెస్టులు చేయించుకోవాలని సూచించారు. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారాయన. తెలంగాణలోనూ క్రమంగా రోజువారి పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.