India Covid Update : భారత్‌లో లక్ష 50 వేలకు చేరువలో కోవిడ్ కేసులు

దేశంలో కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది. గత వారం రోజులుగా కేసులు క్రమేపి పెరుగతూ వస్తున్నాయి. బుధవారం 90 వేల పైగా ఉన్న కేసులు గురువారానికి 1లక్షా 17 వేలకు చేరాయి.

India Covid Update : భారత్‌లో లక్ష 50 వేలకు చేరువలో కోవిడ్ కేసులు

India Coivd Up Date

India Covid Update : దేశంలో కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది. గత వారం రోజులుగా కేసులు క్రమేపి పెరుగతూ వస్తున్నాయి. బుధవారం 90 వేల పైగా ఉన్న కేసులు గురువారానికి 1లక్షా 17 వేలకు చేరాయి. శుక్రవారం ఈ సంఖ్య 1 లక్షా 41 వేలకు చేరింది. నిన్న దేశవ్యాప్తంగా 1,41,986 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఈరోజు విడుదల చేసిన బులెటిన్ లో పేర్కోంది.

మొన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య 21 శాతం ఎక్కువ. గడచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల 285 మంది మరణించారు. ఇప్పటి వరకు కోవిడ్ తదితర కారణాల వల్ల మరణించిన వారి సంఖ్య 4,83,463 కి చేరింది. నిన్న ఒక్కరోజే కోవిడ్ కు చికిత్స పొంది 40, 895 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా 4,72,169యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆ నివేదికలో పేర్కోన్నారు.
Also Read : Trisha : అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా సోకింది : త్రిష
మరో వైపు కోవిడ్ నిరోధానికి ఇస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ 150 కోట్ల మైలు రాయిని దాటి కొత్త రికార్డును నెల కొల్పింది. దేశంలో గత 358 రోజులుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. నిన్నటివరకు 150,61,92,903 మందికి వ్యాక్సిన్ వేశారు. నిన్న ఒక్కరోజే 90,59, 360 మందికి టీకా వేశారు.

మరోవైపు దేశంలోని పలు రాష్ట్రాల్లోనూ కోవిడ్ కేసుల సంఖ్య పెరుగూతు వస్తోంది. మహారాష్ట్రలోఅత్యధికంగా 40,925కేసులు, పశ్చిమ బెంగాల్ లో 18,213,ఢిల్లీలో 17,335,తమిళనాడులో 8,981,కర్ణాటకలో 8,449 కేసులు నమోదు అయ్యాయి.

దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 3,071 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 1,203మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ కేసుల నమోదులో కూడా మహారాష్ట్ర అగ్రస్ధానంలో ఉంది. మహారాష్ట్రలో 876,ఢిల్లీలో 513,కర్ణాటక 333,రాజస్థాన్ లో 291,కేరళలో 284,గుజరాత్ 204,తెలంగాణ 123,తమిళనాడు 121,హర్యానా 114,ఒడిశా 60 ,ఏపీలో 28 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

దేశవ్యాప్తంగా 1,368 ప్రభుత్వ లాబ్స్,1,754 ప్రైవేట్ లాబ్స్ ద్వారా కరోనా నిర్ధారణ పరీక్షలునిర్వహిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో 15,29,948 టెస్టులు చేయగా…ఇప్పటి వరకు 68,84,70,959 మందికి పరీక్షలునిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.