Shah Rukh Khan: మార్వెల్ స్టూడియో సూపర్ హీరో షారూఖ్? బెనెడిక్ట్ కుంబర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

వావ్.. మార్వెల్స్ సినిమాటిక్ యూనివర్స్ మూవీలో షారూఖ్ ఖాన్ పర్ ఫెక్ట్ గా సరిపోతాడు. ఈ మాట నేను అంటున్నది కాదు. మార్వెల్ వారి డాక్టర్ స్ట్రేంజ్ అంటున్నారు. హాలీవుడ్ స్టార్ బెనెడిక్ట్ కుంబర్ బ్యాచ్ షారుఖ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Shah Rukh Khan: మార్వెల్ స్టూడియో సూపర్ హీరో షారూఖ్? బెనెడిక్ట్ కుంబర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Shah Rukh Khan

Shah Rukh Khan: వావ్.. మార్వెల్స్ సినిమాటిక్ యూనివర్స్ మూవీలో షారూఖ్ ఖాన్ పర్ ఫెక్ట్ గా సరిపోతాడు. ఈ మాట నేను అంటున్నది కాదు. మార్వెల్ వారి డాక్టర్ స్ట్రేంజ్ అంటున్నారు. హాలీవుడ్ స్టార్ బెనెడిక్ట్ కుంబర్ బ్యాచ్ షారుఖ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఎక్కడన్నారు? ఎందుకన్నారు లాంటి వివరాలు ఫుల్ స్టోరీలో చూద్దాం.

Shah Rukh Khan: హై ఎనర్జీతో యాక్టివ్‌గా మారిన షారుఖ్.. బాద్షా ఈజ్ బ్యాక్!

డాక్టర్ స్ట్రేంజ్ సీక్వెల్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్శ్ లో హృతిక్ రోషన్, షారూక్ ఖాన్ ఈ ఇద్దరు స్టార్స్ లో ఎవరు ఫిట్ అవుతారు? అని ఓ న్యూస్ ఏజెన్సీ అడిగిన ప్రశ్నకు బెనెడిక్ట్ కుంబర్ బ్యాచ్ తడుముకోకుండా షారూక్ ఖానే పర్ఫెక్ట్ అని చెప్పేశాడు. మార్వెలెస్ స్టూడియోస్ నుంచి వచ్చిన సినిమాలన్నీ భారీ సినిమాలే.. ఇంకా సూపర్ హీరోల ప్రాజెక్టులే.. షారూక్ ఖాన్ రావన్ సినిమాలో.. హృతిక్ క్రిష్ సిరీస్ తో సూపర్ మాన్ గా అలరించారు. కాని, బెనడిక్ట్ మాత్రం షారూక్ ఖాన్ కే ఓటేశాడు.

Shah Rukh Khan: సొంత ఓటీటీతో ఎంట్రీ ఇస్తున్న షారుఖ్

షారూక్ ఖాన్ కోవిడ్ ఆంక్షలు, తన తనయుడి ఇష్యూ కారణంగా సినిమాలకు చాలా టైమ్ బ్రేక్ ఇచ్చాడు. ఇప్పుడు వరసగా సినిమాలు చేస్తూ, అప్పుడు తీసుకున్న బ్రేక్ టైమ్ ను ఫుల్ ఫిల్ చేస్తున్నాడు. అట్లీతో లయన్ షూటింగ్ కంప్లీట్ చేశాడు. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో పఠాన్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇంకా బాలీవుడ్ బాద్షా కొన్నేళ్ల కల రాజ్ కుమార్ హిరాణితో వర్క్ చేయడం. దానిని డమ్కీ సినిమాతో తీర్చేసుకుంటూ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు షారుఖ్.

Shah Rukh Khan: మళ్ళీ ట్రాక్‌లోకి షారుఖ్.. ఆగిన సినిమాలు రీస్టార్ట్!

ఇలా తిరుగులేని బాద్షాగా షారుఖ్ కు ఉన్న పవర్ చూసే మార్వెల్ హీరోగా ఆయన్ని ప్రమోట్ చేశాడు బెనెడిక్ట్ కుంబర్ బ్యాచ్. ఇక ఈ సూపర్ హీరో నటించిన డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ ఇంగ్లీష్, హిందీతో పాటు, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో ఈ నెల 6న ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే ఇండియాలో దాదాపు 20 కోట్ల ప్రీ బిజినెస్ చేసింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పార్టిస్పేట్ చేసిన బెనెడిక్ట్ భారతదేశంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలను ఇష్టపడతానని చెప్పుకొచ్చాడు.