PM Modi : రామానుజుని బోధనలు మనందరికీ స్ఫూర్తిదాయకం : ప్రధాని మోదీ

216 అడుగుల శ్రీరామానుజ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. సమతామూర్తి విగ్రహాన్ని లోకార్పణం చేశారు. శ్రీరామానుజాచార్యుల విగ్రహానికి మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

PM Modi : రామానుజుని బోధనలు మనందరికీ స్ఫూర్తిదాయకం : ప్రధాని మోదీ

Modi

statue of Sri Ramanuja : సరస్వతీదేవీ కృపతో రామానుజుని విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నామని ప్రధాని మోదీ తెలిపారు. గురువు ద్వారానే జ్ఞానాన్ని సముపార్జిస్తామని చెప్పారు. రామానుజుని విగ్రహం ఆయన జ్ఞానం, వైరాగ్యం, ఆదర్శాలకు ప్రతీక అన్నారు. ఈ ప్రతీక రాబోయే తరాల్ని చైతన్యపర్చడమే కాకుండా మన చరిత్రను కూడా సమున్నత చేస్తుందన్నారు. రామానుజాచార్యుల కృపతో 108 దివ్యదేశాల్ని దర్శించుకునే సౌభాగ్యం తనకు కల్గిందన్నారు. దేశమంతా తిరిగి దేవాయలను చూసిన అనుభూతి కల్గిందన్నారు. విష్వక్సేనుని ఇష్టిలో పాలుపంచుకునే భాగ్యం తనకు కల్గిందని తెలిపారు. ఆ యజ్ఞం ఫలం 130 కోట్ల మంది భారతీయులకు లభించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

216 అడుగుల శ్రీరామానుజ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. సమతామూర్తి విగ్రహాన్ని లోకార్పణం చేశారు. శ్రీరామానుజార్యుల విగ్రహానికి మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. విష్వక్సేన ఇష్టి పూర్ణాహుతి కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. యాగాశాలలో ప్రధాని మోదీకి చిన్నజీయర్ స్వామి కంకణం కట్టారు. విష్వక్సేనుడికి హారతి ఇచ్చారు. 108 దివ్యదేశ క్షేత్రాలను సందర్శించారు. అనంతరం మోదీ ప్రసంగించారు.

PM Modi : శ్రీరామానుజ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.. జాతికి అంకితం

సంస్కరణల కోసం మూలాల నుంచి దూరంగా వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ఆ కాలంలో మూఢ విశ్వాసాన్ని ఎదిరించడమంటే ఎంత కష్టమని చెప్పారు. కానీ, రామానుజాచార్యులు అందర్నీ కలుపుకొని ముందుకు వెళ్లారని తెలిపారు. రామానుజుని బోధనలు మనందరికీ స్ఫూర్తిదాయకం అన్నారు. ఈ రోజు వసంత పంచమి శుభదినం అన్నారు. అంబేద్కర్ లాంటి సామాజిక సంస్కకర్త కూడా రామానుజాచార్యుల సిద్ధాంతాన్ని అవలంభించారని పేర్కొన్నారు. ఎలాంటి భేదాభావాలు లేకుండా సామాజిక న్యాయం అందరికీ అందాలని కోరుకున్నారు. ప్రభుత్వ పథకాలు దళితుల అభ్యున్నతికి దోహదం చేస్తున్నాయని చెప్పారు.

రామానుజులు తనకంటే జనసంక్షేమం కోసం ఎక్కువ ఆలోచించారని పేర్కొన్నారు. ‘నేను ఒక్కడ్ని నరకానికి వెళ్లినా ఎలాంటి బాధ లేదు.. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని రామానుజాచార్యులు అన్నారు’ అని మోదీ తెలిపారు. ప్రజలందరి సుభిక్షం కోసం గురువు తనకు ప్రబోధించిన మంత్రాన్ని అందరికీ పంచారని పేర్కొన్నారు. అన్నమాచార్యులు కూడా రామానుజాచార్యుల్ని కీర్తించారని తెలిపారు. రామానుజాచార్యులు తన ఆధ్యాత్మిక శక్తితో దేశం మొత్తాన్ని సమైక్యపర్చారని అన్నారు. భక్తికి జాతి, కులం లేదని రామానుజాచార్యులు చాటారని తెలిపారు.

PM Modi : వ్యవసాయాన్ని అందరికీ ఉపయోగకరంగా చేయడంలో ఇక్రిశాట్ సక్సెస్ : ప్రధాని మోదీ

సర్దార్ పటేల్ దూరదృష్టి చూడాని హైదరాబాదీ ఉండరన్నారు. గతేడాది రామప్ప ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిందని గుర్తు చేశారు. అలాగే పోచంపల్లిని కూడా పర్యాటక గ్రామంగా గుర్తించిందన్నారు. తెలుగు సినిమా కూడా దేశవ్యాప్తంగా విశేషాదరణ పొందుతోందన్నారు. తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని చెప్పారు. తెలుగు కళాకారులకు విశేష గుర్తింపు వస్తోందన్నారు.

ప్రధాని మోదీ ప్రత్యేక హెలికాప్టర్ లో ముచ్చింతల్ చేరుకున్నాడు. రామానుజాచార్యుల సహస్రాబ్ధి ఉత్సవాల్లో పీఎం పాల్గొన్నారు. యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. విశ్వానికి మానవతా సందేశాన్ని అందించిన మహనీయులైన శ్రీ రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామి సత్య సంకల్పంతో.. దివ్య సాకేతంలో రూపొందిన 216 అడుగుల భగవద్రామానుజాచార్యుల మహా విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించి, జాతికి అంకింతం చేశారు.

Ministers Committee : హెచ్‌ఆర్‌ఏ స్లాబులపై మంత్రుల కమిటీ కొత్త ప్రతిపాదనలు

రంగారెడ్డి జిల్లా ముచ్చింత్ లో సమతామూర్తి శ్రీమానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ముచ్చింతల్ ఆశ్రమానికి చేరుకున్న మోదీ… అనంతరం యాగశాలకు చేరుకున్నారు. అక్కడ విశ్వక్సేన ఇష్టి పూర్ణాహుతిలో పాల్గొన్నారు. మన అభీష్టాలను నెరవేర్చేందుకు కోసం విశ్వక్సేన ఇష్టి నిర్వహించారు.. ప్రధాని చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధించాలన్న సంకల్పంతో ఈ విశ్వక్సేన ఇష్టిని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామిజీ నిర్వహించారు.