Rahul Gandhi : కాలినడకన వైష్ణోదేవి ఆలయానికి రాహుల్..ఇందిరా గాంధీ ఫోటో వైరల్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ రెండు రోజుల జమ్మూకశ్మీర్ పర్యటనకు వెళ్లారు.

Rahul Gandhi : కాలినడకన వైష్ణోదేవి ఆలయానికి రాహుల్..ఇందిరా గాంధీ ఫోటో వైరల్

Ra5

Updated On : September 9, 2021 / 4:18 PM IST

Rahul Gandhi కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ రెండు రోజుల జమ్మూకశ్మీర్ పర్యటనకు వెళ్లారు. గత నెలలోనే జమ్ముకశ్మీర్‌లో రెండు రోజులు పర్యటించిన రాహుల్‌గాంధీ.. ఇప్పుడు మరోసారి జమ్ముకశ్మీర్ పర్యటనకు వెళ్లారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ జమ్ము చేరుకున్నారు రాహుల్ గాంధీ.

జమ్ము ఎయిర్ పోర్ట్ లో దిగిన రాహుల్ కి కాంగ్రెస్‌ పార్టీ నేతలు,కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో జమ్ముకశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితులపై రాహుల్‌ చర్చించనున్నారు. ఈ రోజు సాయంత్రం జమ్ముకి దగ్గర్లోని కత్రా సిటీలో ఉన్న మాతా వైష్ణోదేవి ఆలయంలో ప్రత్యేక పూజల్లో రాహుల్ పాల్గొననున్నారు.

రాహుల్‌గాంధీ…కత్రా నుంచి సాయంత్రం కాలి నడకన వైష్ణోదేవి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకోనున్నారని జమ్ముకశ్మీర్‌ పీసీసీ అధ్యక్షుడు గులాం అహ్మద్‌ మీర్‌ తెలిపారు. పవిత్ర ఆలయాల పట్ల రాహుల్‌ గాంధీకి ఎంతో నమ్మకమున్నదని, అందుకే వైష్ణోదేవి ఆలయానికి కాలినడకన వెళ్లేందుకు నిర్ణయించుకున్నారని చెప్పారు. అందుకే తొలిరోజున ఎలాంటి సమావేశాలు ఏర్పాటుచేయలేదన్నారు.  శుక్రవారం రాహుల్ గాంధీ కత్రా నుంచి కారులో జమ్ముకు వెళ్లి అక్కడ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని చెప్పారు.

కాగా రాహుల్ గాంధీ వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్న నేపథ్యంలో..గతంలో మాజీ ప్రధాని, రాహుల్ నాయనమ్మ ఇందిరాగాంధీ 1970ల్లో వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

READ పాక్ పై రాహుల్ ఫైర్;కశ్మీర్ విషయంలో ప్రభుత్వానికి మద్దతు