Telangana Cabinet Meeting : సోమవారం సీఎం అధ్యక్షతన మంత్రివర్గ భేటీ

సీఎం కేసీఆర్ అధ్యక్షతన సోమవారం రాష్ట్ర మంత్రివర్గం భేటీకానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో క్యాబినెట్ భేటీ జరగనుంది.

Telangana Cabinet Meeting : సోమవారం సీఎం అధ్యక్షతన మంత్రివర్గ భేటీ

Telangana Cabinet Meeting

Telangana Cabinet Meeting : సీఎం కేసీఆర్ అధ్యక్షతన సోమవారం రాష్ట్ర మంత్రివర్గం భేటీకానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో క్యాబినెట్ భేటీ జరగనుంది. ఇందుకు సంబందించిన ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ధాన్యం కొనుగోళ్లు, యాసంగి పంటల సాగు, కరోనా పరిస్థితులపై చర్చించనున్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.

చదవండి : Telangana Government : కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం

ఇక ఆఫ్రికా దేశాల్లో కొత్తరకం కరోనా ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూడటంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా అలెర్ట్ అయింది. ఈ మేరకు వైద్యాధికారులతో మీటింగ్ ఏర్పాటు చేసి అనేక సూచనలు చేశారు. విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చేవారి సంఖ్య అధికంగా ఉండే అవకాశం ఉండటంతో శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో హైఅలెర్ట్ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. అక్కడ వైద్య సిబ్బందికి పలు సూచనలు చేసింది. సౌత్ ఆఫ్రికా, తోపాటు మరికొన్ని దేశాలకు హైదరాబాద్ నుంచి నేరుగా విమాన సర్వీసులు లేకపోయినా, ఢిల్లీ, ముంబై నగరాలకు వచ్చి.. అక్కడి నుంచి హైదరాబాద్ వస్తుంటారు. ]

చదవండి : Telangana : ధాన్యం కొనుగోళ్ల పంచాయితీ..కేంద్రం ఏం చెబుతుంది ?

వీరివలన కొత్త వేరియంట్ వస్తే తీవ్ర పరిణామాలు ఎదురుకోవాల్సి ఉంటుంది. అందుకే రాష్ట్రప్రభుత్వం ముందుగానే అప్రమత్తమై బోట్స్‌వానా, దక్షిణాఫ్రికా, బెల్జియం ఇజ్రాయెల్, హాంకాంగ్‌ల నుంచి వచ్చే వారిని క్షున్నంగా తనిఖీ చేయాలనీ ఆదివారం ఆరోగ్యశాఖామంత్రి హరీష్ రావు నేతృత్వంలో జరిగిన సమావేశంలో సూచించారు. సోమవారం సమావేశంలో మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

చదవండి :