Telangna Corona Cases : తెలంగాణలో కొత్తగా 201 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 201 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 76 మంది కరోనా బారిన పడ్డారు. కరోనాతో మరొకరు మరణించారు.

Telangana Corona Cases
Telangana Corona Cases : తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 201 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 76 మంది కరోనా బారిన పడ్డారు. కరోనాతో మరొకరు మరణించారు. గత 24 గంటల్లో 184 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. కరోనా రికవరీ రేటు 98.83 శాతంగా ఉంది.
ప్రస్తుతం రాష్ట్రంలో 3వేల 887 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,77,747కి చేరింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 6,69,857కి చేరుకుంది. రిస్క్ దేశాల నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు 312 మంది వచ్చారు.
SBI CBO Recruitment 2021 : ఎస్బీఐలో ఉద్యోగాలు.. 1226 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
దేశాన్ని కరోనా పీడ వదిలేలా లేదు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి దడ పుట్టిస్తోంది. ఇదే తరహాలో వ్యాప్తి చెందితే ఒమిక్రాన్ కేసులు సంఖ్య పెరుగుతూ మరోసారి దేశాన్ని అతలాకుతలం చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ వైరస్ వ్యాప్తిని చూస్తుంటే థర్డ్ వేవ్ తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 57 దేశాలకు ఒమిక్రాన్ వ్యాపించింది. మన దేశంలో ఇప్పటివరకు మొత్తం 24 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
కరోనా మహమ్మారి వెలుగు చూసి.. దాదాపు 2 ఏళ్లు కావస్తోంది. ఈ రెండేళ్ల కాలంలో అనేక కొత్త వేరియంట్లు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేశాయి. నిన్నమొన్నటి దాకా అత్యంత ప్రమాదకారిగా డెల్టా వేరియంట్ వణికించింది. ఇప్పుడు డెల్టా వేరియంట్ ను తలదన్నే.. ఒమిక్రాన్ అనే మరో వేరియంట్ బెంబేలెత్తిస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. కరోనా తగ్గుముఖం పట్టి… సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో… కొత్త వేరియంట్ భయబ్రాంతులకు గురి చేస్తోంది.
iPhone 13 Mini: ఐఫోన్‌పై నెవర్ బిఫోర్ ఆఫర్.. రూ.36వేలు డిస్కౌంట్
గతంలో వచ్చిన వేరియంట్ల కంటే ఇది చాలా ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో అనేక దేశాలు మళ్లీ ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోయాయి. చాలా దేశాలు ఇప్పటికే విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి.
ఈ పరిస్థితుల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందేనని నిపుణులు తేల్చి చెప్పారు. కరోనా నిబంధనలు పాటించాల్సిందే అన్నారు. మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని, అలాగే అర్హులందరూ తప్పకుండా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.