Telangana: సీఎం కేసీఆర్ లెక్క ఇదే.. వారిని మంత్రి పదవి వరించేనా?

తెలంగాణలో ఎమ్మెల్సీల లెక్క తేలిపోయింది. నామినేషన్లు కూడా దాఖలు చేశారు. ఊహించని రీతిలోకి కొత్త పేరు ఖరారు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్.

Telangana: సీఎం కేసీఆర్ లెక్క ఇదే.. వారిని మంత్రి పదవి వరించేనా?

Mlc

Telangana: తెలంగాణలో ఎమ్మెల్సీల లెక్క తేలిపోయింది. నామినేషన్లు కూడా దాఖలు చేశారు. ఊహించని రీతిలోకి కొత్త పేరు ఖరారు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్‌ను ఎమ్మెల్సీగా ఖరారు చేశారు.

పొలిటికల్ సర్కిల్‌లో సరికొత్త చర్చకు ఈ మార్పు దారితీయగా.. సామాజికవర్గాలవారీగా పదవులు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారని తెలంగాణ భవన్‌లో టాక్ నడుస్తోంది.

ఈ క్రమంలోనే ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బండ ప్రకాష్‌ను ఎమ్మెల్సీగా ఎంపిక చేశారని టాక్ వినిపిస్తోంది. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉండటమే కేసీఆర్ నిర్ణయానికి కారణమని చెబుతున్నారు.

ఈటల రాజేందర్ బర్తరఫ్ తర్వాత ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వారెవరూ కేబినెట్‌లో లేరు. దీంతో ఆ వర్గానికి చెందిన నేతకు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారట. అందుకే బండ ప్రకాష్‌కు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి నామినేషన్ వేయించారని తెలుస్తోంది.

Bandi Sanjay: పంట కొనేవరకు పోరాటం ఆపే ప్రసక్తేలేదు -బండి సంజయ్

ప్రస్తుతం కేసీఆర్ దగ్గరే.. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు ఉండగా.. వాటిని కూడా ఇతరులకు కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ క్రమంలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మరోవైపు సిద్దిపేట కలెక్టర్‌గా రాజీనామా చేసిన వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు కూడా మంత్రి పదవి దక్కే అవకాశం కనిపిస్తుంది. రెవెన్యూ మీద పట్టుండటంతో.. రెవెన్యూ శాఖను వెంకట్రామిరెడ్డికే కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు.

CM KCR: తగ్గేదే లే.. కేంద్రంతో కొట్లాటే.. రేపే ఇందిరా పార్క్‌ దగ్గర ధర్నా!