TSPSC paper leak: గ్రూప్-1లో అధిక మార్కులు వచ్చిన ఇద్దరితో పాటు మరో నిందితుడికి రిమాండ్.. చంచల్ గూడ జైలుకి తరలింపు

ముందుగానే ప్రశ్నపత్రాన్ని తీసుకుని, హాయిగా పరీక్ష రాసి ఉద్యోగాలు సంపాదించారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాన్ని తనకు రాజశేఖర్ ఇచ్చాడని అధికారుల ముందు షమీమ్ అనే నిందితుడు ఒప్పుకున్నాడు.

TSPSC paper leak: గ్రూప్-1లో అధిక మార్కులు వచ్చిన ఇద్దరితో పాటు మరో నిందితుడికి రిమాండ్.. చంచల్ గూడ జైలుకి తరలింపు

TSPSC Paper Leak

TSPSC paper leak: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) లీకేజీ కేసులో నిందితులను ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అధికారులు నిందితులను ఇవాళ నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. గ్రూప్-1లో 127 మార్కులు వచ్చిన షమీమ్ అనే నిందితుడు, 122 మార్కులు సాధించిన మరో నిందితుడు రమేశ్ సహా సురేశ్ అనే మరో నిందితుడిని పోలీసులు ఇవాళే అరెస్టు చేశారు. వారిని కోర్టులో హాజరు పర్చగా వారికి న్యాయస్థానం రిమాండ్ విధించింది.

రమేశ్, సురేశ్, షమీమ్ 14 రోజుల రిమాండ్ (ఏప్రిల్ 6 వరకు)లో ఉండనున్నారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా రమేశ్ పనిచేస్తున్నాడు. అలాగే, 2013లో గ్రూప్-2 ఉద్యోగం పొందాడు షమీమ్. రాజశేఖర్ నుంచి అతడు గ్రూప్-1 ప్రశ్నపత్రం తీసుకున్నాడు. గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాన్ని తను రాజశేఖర్ ఇచ్చాడని అధికారుల ముందు షమీమ్ ఒప్పుకున్నాడు.

ఇవాళ అరెస్టు చేసిన ముగ్గురు నిందితులను కోర్టు ఆదేశాలతో చంచల్ గూడ జైలుకి తరలించారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ లీకేజీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విచారణ జరుగుతున్న కొద్దీ కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నారైలు కూడా పరీక్షలు రాశారని అంటున్నారు.

TSPSC paper leak: నాకు ఇచ్చినట్లే కేటీఆర్ కూ నోటీసులు ఇవ్వాలని ఫిర్యాదు చేశాను: రేవంత్ రెడ్డి