Keeravani : రామోజీరావు కోసమైనా ఆస్కార్ తీసుకురావాలి అనుకున్నా.. ఆస్కార్ కోసం 200 సార్లు RRR సినిమాని స్క్రీనింగ్ వేశాం..

తాజాగా ఆదివారం (ఏప్రిల్ 10)న టాలీవుడ్ అంతా కలిసి కీరవాణి, చంద్రబోస్, RRR యూనిట్ ని అభినందించారు. హైదరాబాద్ శిల్పకళావేదికలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.

Keeravani : రామోజీరావు కోసమైనా ఆస్కార్ తీసుకురావాలి అనుకున్నా.. ఆస్కార్ కోసం 200 సార్లు RRR సినిమాని స్క్రీనింగ్ వేశాం..

Keeravani speech in Oscar Felicitation event by Tollywood

Keeravani :  RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొని అందులోని నాటు నాటు(Naatu Naatu) సాంగ్ కు ప్రపంచంలోనే అత్యున్నత సినిమా పురస్కారం ఆస్కార్(Oscar) అందుకుంది. అంతర్జాతీయ ఆస్కార్ వేదికపై కీరవాణి(Keeravani), చంద్రబోస్(Chandrabose) ఆస్కార్ అవార్డుని అందుకొని సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇండియా నుంచి మొట్టమొదటి సాంగ్ కి ఆస్కార్ అవార్డు వచ్చిన రికార్డ్ నాటు నాటు సాంగ్ సృష్టించింది. దీంతో ప్రపంచమంతా RRR యూనిట్ ని అభినందిస్తున్నారు.

తాజాగా ఆదివారం (ఏప్రిల్ 10)న టాలీవుడ్ అంతా కలిసి కీరవాణి, చంద్రబోస్, RRR యూనిట్ ని అభినందించారు. హైదరాబాద్ శిల్పకళావేదికలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి తెలుగు సినీ ప్రముఖులతో పాటు తెలంగాణ, ఆంద్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రులు, పలువురు రాజకీయ ప్రముఖులు కూడా విచ్చేశారు. అందరూ కలిసి తెలుగు పాటకు ఆస్కార్ అవార్డు తెచ్చినందుకు కీరవాణి, చంద్రబోస్ లను ఘనంగా సత్కరించారు.

Oscar Felicitation event

ఈ కార్యక్రమంలో కీరవాణి మాట్లాడుతూ.. ప్రతి గుడిలో ఎక్కడైనా మూల విగ్రహాలు ఉంటాయి, వాటిని బయటకు తీసుకురాలేరు కాబట్టి ఉత్సవ విగ్రహాలని పెట్టి ఊరేగిస్తారు. ఇక్కడ కూడా ఆస్కార్ విషయంలో రాజమౌళి, ప్రేమ్ రక్షిత్ మూల విగ్రహాలు అయితే, నేను, చంద్రబోస్ ఉత్సవ విగ్రహాలు. మాకు జరిగే సన్మానాలు, ఈ అభినందనలు అన్ని వారివే. ఇలా మమ్మల్ని సన్మానించడానికి చిత్రపరిశ్రమ అంతా ఒక్క చోట చేరినందుకు చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో ఏ కార్యక్రమం అయినా ఇలాగే అందరూ కలిసి చేయాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

ఇక కీరవాణి ఆస్కార్ గురించి మాట్లాడుతూ.. అన్ని అవార్డులలాగే ఆస్కార్ కూడా ఒకటి అనుకున్నాను. ప్రపంచంలోనే గొప్ప అవార్డు అని తెలుసు. కానీ ఎందుకో అంత ఎగ్జైట్మెంట్ అయితే లేదు. గెలిచిన తర్వాత కూడా అలాగే ఉన్నాను. నా మొదటి పాట మద్రాస్ లోని ప్రసాద్ థియేటర్లో రికార్డ్ చేశాను. అది చాలా గొప్ప థియేటర్. ఒక దేవాలయం లాంటిది. నాకు మొదటి పాటకు అంత గొప్ప థియేటర్లో చేయడానికి అవకాశం ఇచ్చిన కృష్ణం రాజు, సూర్య నారాయణ రాజు గారికి నా కృతజ్ఞతలు. అక్కడ ఆ రోజు పాట రికార్డ్ చేస్తుంటే ఎంత అనుభూతికి లోనయ్యానో ఆస్కార్ తీసుకుంటున్నప్పుడు కూడా అదే అనుభూతికి లోనయ్యాను అని తెలిపారు.

Laxman Sivaramakrishnan : సౌత్ ఇండియన్ కల్చర్ ని డీగ్రేడ్ చేస్తున్నారు.. సల్మాన్, చరణ్ సాంగ్ పై మాజీ క్రికెటర్ సంచనల వ్యాఖ్యలు..

అలాగే.. ఎప్పుడూ నా భార్య చెప్తూ ఉండేది.. జీవితంలో ఒక్కసారైనా రామోజీరావు గారిలా బతకాలని. ఒకసారి నాటు నాటు పాట గ్లోబల్ రీచ్ అయ్యాక రామోజీరావు గారిని కలిశాను. అప్పుడు ఆయన ఆస్కార్ తీసుకురండి అని చెప్పారు. అంత గొప్ప రామోజీ రావు గారే ఆస్కార్ కి విలువ ఇస్తున్నారంటే అది చాలా గొప్పది అని భావించి రామోజీరావు గారి కోసమైనా ఆస్కార్ అవార్డు తీసుకురావాలని అనుకున్నాను. ఆస్కార్ ప్రకటించే కొన్ని సెకన్ల ముందు వరకు కొంత టెన్షన్ ఫీల్ అయ్యాను. అవార్డు అందుకున్నాక అంతా మాములే అని అన్నారు. దీంతో కీరవాణి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Shruti Haasan : శృతిహాసన్ పై ఫైర్ అవుతున్న టాలీవుడ్ ఆడియన్స్..

ఇక ఆస్కార్ ప్రమోషన్స్ కోసం కార్తికేయ చాలా కష్టపడ్డాడు అని, అమెరికాలో ఆస్కార్ కమిటీలో ఉండే పదివేల మందికి దాదాపు 200 సార్లు RRR సినిమాని స్క్రీనింగ్ వేశామని, వాళ్లకు సినిమా, పాట నచ్చినందుకు ఆస్కార్ లభించిందని అన్నారు. ఈ ప్రయాణంలో పైకి కనపడే మేమే కాక మా వెనక ఉండి మాకు సపోర్ట్ చేసిన అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు అని కీరవాణి తెలిపారు.