Stars OTT Entry: ఇప్పుడిదే ట్రెండ్.. ఓటీటీ ఎంట్రీ ఇస్తున్న స్టార్స్!

ఓటీటీలో ఫేడవుట్ అయిపోయిన స్టార్లు, అవకాశాల కోసం వెయిట్ చేస్తున్న అప్ కమింగ్ ఆర్టిస్టులు ఉంటారనుకుంటే తప్పుకంటెంట్ లో కాలేసినట్టే.

Stars OTT Entry: ఇప్పుడిదే ట్రెండ్.. ఓటీటీ ఎంట్రీ ఇస్తున్న స్టార్స్!

Stars Ott Entry

Stars OTT Entry: ఓటీటీలో ఫేడవుట్ అయిపోయిన స్టార్లు, అవకాశాల కోసం వెయిట్ చేస్తున్న అప్ కమింగ్ ఆర్టిస్టులు ఉంటారనుకుంటే తప్పుకంటెంట్ లో కాలేసినట్టే. ఓటీటీ ఇప్పుడు హాట్ కేక్ లా సేల్ అయ్యే ఫ్లాట్ ఫామ్. అందుకే మెయిన్ స్ట్రీమ్ సినిమాలు చేస్తున్న స్టార్ హీరో, హీరోయిన్లు కూడా ఇప్పుడు ఓటీటీ మీద విపరీతంగా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అంతేకాదు అంతకన్నా ఎగ్జైటింగ్ కంటెంట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు.

Ramesh Deo: వెటరన్ నటుడు రమేశ్ డియో కన్నుమూత

ఓటీటీ.. ఇప్పుడు ట్రెండ్ అవుతున్న మీడియా. ఫస్ట్ లో ఓటీటీ అంటే పెద్దగా అవకాశాలు లేక,. ఫేడవుట్ అయిన స్టార్ కాస్ట్ తోనే కంటెంట్ ఉంటుందనుకునే వారు. కానీ సినిమాలకు మించి క్రేజీగా సిరీస్ లు, సినిమాలు తెరకెక్కించడంతో స్టార్లు కూడా ఓటీటీ మీద ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఈ విషయంలో బాలీవుడ్ జనాలు ముందే ఉన్నా.. సౌత్ స్టార్లు మాత్రం ఇప్పుడిప్పుడే ఓటీటీకి ఎంట్రీ ఇస్తున్నారు. లేటెస్ట్ గా దుల్కర్ సల్మాన్ తన ఓటీటీ డెబ్యూ కోసం రెడీ అవుతున్నారు.

Telugu Movies Releases: సమ్మర్ లో హీటెక్కించబోతున్న సినిమా జాతర

తెలుగు, తమిళ్, మళయాళం, హిందీలో సినిమాలు చేస్తున్న దుల్కర్.. ఇప్పుడు ఓటీటీకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఫ్యామిలీ మ్యాన్ తో ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న రాజ్, డి.కెతో కలిసి గన్స్ అండ్ గులాబ్ టైటిల్ తో తెరకెక్కుతున్న సిరీస్ తో ఓటీటీ వరల్డ్ లోకి వస్తున్నారు. నైన్టీస్ బ్యాక్ డ్రాప్ లో డార్క్ రొమాన్స్ కామెడీ క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ గన్స్ అండ్ గులాబ్ ప్రజెంట్ షూటింగ్ లో బిజీగా ఉంది.

Garikipati-Pushpa: పుష్పపై గరికపాటి ఫైర్.. స్మగ్లర్‌ను హీరోగా చూపించి ఏం మెసేజ్ ఇద్దామని!

సౌత్ లో స్పెషల్లీ తెలుగు స్టార్స్ ఇప్పటి వరకూ పెద్దగా ఓటీటీ కి రాలేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైమ్ రూల్స్ బ్రేక్ చేస్తూ.. నాగచైతన్య.. ఇంట్రస్టింగ్ వెబ్ సిరీస్ చేస్తున్నారు. విక్రమ్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ ఇంట్రస్టింగ్ వెబ్ సిరీస్ లో నాగచైతన్య నెవర్ బిఫోర్ రోల్ లో కనిపించబోతున్నారు. మూడు సిరీస్ లుగా తెరకెక్కుతున్న ఈ సిరీస్ లో నాగచైతన్య తన రొటీన్ ఇమేజ్ ని బ్రేక్ చేసే లుక్ లో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చెయ్యబోతున్నారు.

RRR: 50 రోజుల్లో ఆర్ఆర్ఆర్.. పోస్టర్ తో కౌన్ డౌన్ స్టార్ట్!

సీనియర్ హీరో వెంకటేష్ కూడా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. వెంకీ-రానా డ్యుయో కలిసి చేస్తున్న ఈ వెబ్ సిరీస్ రానా నాయుడు టైటిల్ తో తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. క్రైమ్ డ్రామాగా హిందీలో తెరకెక్కుతున్న ఈ మూవీతో అటు వెంకటేష్, రానా ఓటీటీ కి వస్తున్నారు.

Bro Daddy : బాబాయి-అబ్బాయితో మలయాళం సూపర్ హిట్ ‘బ్రో డాడీ’ తెలుగు రీమేక్

సౌత్ స్టార్లు ఇప్పుడిప్పుడే ఓటీటీ ల షూట్ స్టార్ట్ చేస్తుంటే.. బాలీవుడ్ స్టార్లు మాత్రం ఆల్రెడీ వెబ్ సిరీస్ లు చేస్తూ.. ఎంట్రీకి రెడీ అవుతున్నారు. లేటెస్ట్ గా బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్ గన్.. రుద్ర సిరీస్ తో డిస్నీ హాట్ స్టార్ లో కాప్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో ఓటీటీ ఆడియన్స్ కి ఇంట్రడ్యూస్ అవుతున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంటోంది.

SSMB28 : త్రివిక్రమ్, మహేష్ సినిమా SSMB28 ముహూర్తం

కబీర్ ఖాన్ మూవీతో 300కోట్లు కలెక్షన్ల వసూల్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన షాహిద్ కపూర్ కూడా మెయిన్ స్ట్రీమ్ సినిమాలు చేస్తూ.. ఓటీటీకి వస్తున్నారు. రాజ్, డి.కె క్రేజీ కాంబినేషన్లో విజయ్ సేతుపతి, రాశిఖన్నా లీడ్ రోల్స్ లో సిరీస్ చేస్తున్నారు షాహిద్ కపూర్. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సిరీస్ త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది.

Vijay Deverakonda : ‘ఫ్యూచర్ పాన్ ఇండియా స్టార్’.. విజయ్ దేవరకొండకు మహేష్ ఫ్యాన్స్ సపోర్ట్..

ఆషికీ 2తో అదరగొట్టిన ఆదిత్య రాయ్ కపూర్ కూడా ఓటీటీ స్పేస్ ని వాడుకుంటున్నారు. బ్రిటిష్ సిరీస్..ద నైట్ మేనేజర్ ఆధారంగా హిందీలో తెరకెక్కుతున్న ఇంట్రస్టింగ్ సరిసీస్ లో ఆదిత్య రాయ్ కపూర్ నటిస్తున్నారు.

Pan India Films: దండయాత్ర.. ఇది బాలీవుడ్‌పై టాలీవుడ్ దండయాత్ర!

ఫర్ ద ఫస్ట్ టైమ్ సోనాక్షి సిన్హా కూడా ఓటీటీకి వస్తోంది. అమెజాన్ ప్రైమ్.. ఫాలెన్ అనే సిరీస్ తో ఓటీటీ డెబ్యూ ఇస్తోంది ఈ దబంగ్ భామ. జోయా అక్తర్ ప్రొడ్యూసర్ గా తెరకెక్కుతున్న ఈ ఇంట్రస్టింగ్ సిరీస్ లో అంజలి భాతి క్యారెక్టర్ చేస్తున్న సోనాక్షి లేటెస్ట్ గా సిరీస్ మెంబర్స్ తో కలిసున్న ఫోటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.