Uttar Pradesh: కాన్పూర్‌లో రెండు గంటల వ్యవధిలో 31మంది మృతి, 20 మందికి గాయాలు.. ఎలా అంటే..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో శనివారం రాత్రి రెండు గంటల వ్యవధిలోనే రెండు వేరువేరు ప్రమాదాల్లో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 27మందికిపైగా గాయపడ్డారు.

Uttar Pradesh: కాన్పూర్‌లో రెండు గంటల వ్యవధిలో 31మంది మృతి, 20 మందికి గాయాలు.. ఎలా అంటే..

Kanpur Accident

Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో గత రాత్రి రెండు గంటల వ్యవధిలోనే 31 మంది ప్రాణాలు కోల్పోయారు. రెండు వేరువేరు ప్రమాదాల్లో 27మందికిపైగా గాయపడ్డారు. శనివారం రాత్రి కాన్పూర్‌లోని ఘతంపూర్ ప్రాంతంలో 50 మంది యాత్రికులతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ చెరువులో బోల్తా పడటంతో మొదటి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 26 మంది యాత్రికులు మరణించారు. వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు మరణించగా, మరో 20మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.

Football Match In Indonesia: ఇండోనేషియాలో ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో తొక్కిసలాట.. 127 మంది మృతి, మరో 180 మందికి గాయాలు

ఉన్నావ్ లోని చంద్రికా దేవి ఆలయం నుంచి ట్రాక్టర్ పై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు, స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. 26మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అదేవిధంగా క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రూ. 50వేలు ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు.

Mark Zuckerberg: నియామకాలు లేవు, త్వరలో మరిన్ని తొలగింపులు.. ఉద్యోగులకు షాకిచ్చిన మార్క్ జూకర్‌బర్గ్.. ఎందుకంటే..

ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, మృతుల కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేశారు. సహాయక చర్యలను పర్యవేక్షించడానికి సీనియర్ మంత్రులు రాకేష్ సచన్, అజిత్ పాల్‌లను సంఘటనా స్థలానికి పంపారు. రవాణా కోసం ట్రాక్టర్, ట్రాలీని ఉపయోగించొద్దని యోగి ఆదిత్యనాథ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ పనులకు, సరుకుల బదిలీకి ట్రాక్టర్ ట్రాలీని ఉఫయోగించాలని సీఎం అన్నారు. రెస్క్యూ ఆపరేషన్‌ను సీఎం యోగి ఆధిత్య‌నాథ్ వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారని ప్రభుత్వ ప్రతినిధి లక్నోలో తెలిపారు.

TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

నగరంలో గంటల వ్యవధిలో జరిగిన రెండో రోడ్డు ప్రమాదంలో అహిర్వాన్ ప్లై ఓవర్ సమీపంలో లోడర్ టెంపోను వేగంగా వస్తున్న ట్రక్కు ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.