Doctors: కరోనా సెకండ్ వేవ్‌‌లో 719మంది డాక్టర్లు మృతి

భారత్‌లో కరోనా సెకండ్ వేవ్‌లో 719 మంది వైద్యులు చనిపోయినట్లుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఎ) ప్రకటించింది. సెకండ్ వేవ్‌లో బీహార్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాల్లో అత్యధికంగా డాక్టర్లు చనిపోయారని ఐఎంఎ వెల్లడించింది.

Doctors: కరోనా సెకండ్ వేవ్‌‌లో 719మంది డాక్టర్లు మృతి

Doctors

Second Wave: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్‌లో 719 మంది వైద్యులు చనిపోయినట్లుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఎ) ప్రకటించింది. సెకండ్ వేవ్‌లో బీహార్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాల్లో అత్యధికంగా డాక్టర్లు చనిపోయారని ఐఎంఎ వెల్లడించింది. సెకండ్ వేవ్ సమయంలో బీహార్‌లో 111, ఢిల్లీలో 109, ఉత్తర ప్రదేశ్‌లో 79, పశ్చిమ బెంగాల్‌లో 63, రాజస్థాన్‌లో 43 మంది డాక్టర్లు చనిపోయారు. సెకండ్ వేవ్‌లో ఏపీలో 35, తెలంగాణలో 36 మంది మృతిచెందారు.

ఇప్పటివరకు రెండు విడతల్లో 1467మంది డాక్టర్లు చనిపోగా.. గతేడాది మొదటి దశలో కరోనాతో 748 మంది డాక్టర్లు చనిపోయారు. భారత్‌లో 12 లక్షలకు పైగా డాక్టర్లు ఉండగా.. వైద్యుల సంఘంలో రిజిస్టరైనవారు 3.5 లక్షల మంది మాత్రమే ఉండగా.. చనిపోయిన వారి సంఖ్య మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా హెల్త్ వర్కర్స్‌లో సుమారు 70 శాతం మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. ఫస్ట్ డోసును 90శాతం మంది తీసుకున్నారు.