NIA : సైన్యం సమాచారాన్ని పాకిస్థాన్ చేరవేసిన అన్నదమ్ములు

ఇద్దరు అన్నదమ్ములు నౌకాదళ రహస్యాలను, సైనిక సంబంధ సమాచారాన్ని శత్రుదేశమైన పాకిస్థాన్ కు అందించారు. జాతీయ దర్యాప్తు సంస్థ విచారణలో విషయాలు వెలుగుచూడటంతో ఇద్దరు అన్నదమ్ములు కటకటాల పాలయ్యారు.

NIA : సైన్యం సమాచారాన్ని పాకిస్థాన్ చేరవేసిన అన్నదమ్ములు

Nia

NIA: ఇద్దరు అన్నదమ్ములు నౌకాదళ రహస్యాలను, సైనిక సంబంధ సమాచారాన్ని శత్రుదేశమైన పాకిస్థాన్ కు అందించారు. జాతీయ దర్యాప్తు సంస్థ విచారణలో విషయాలు వెలుగుచూడటంతో ఇద్దరు అన్నదమ్ములు కటకటాల పాలయ్యారు. వివరాల్లోకి వెళితే విశాఖపట్నం గూఢచర్య రాకెట్ కేసులో గతంలో పట్టుబడ్డ ఇమ్రాన్ గిటేలీ, ఉత్తర్‌ప్రదేశ్‌ గూఢచర్య రాకెట్‌ కేసులో తాజాగా అరెస్టైన అనస్‌ గిటేలీలు అన్నదమ్ములు. వీరిది గుజరాత్ లోని పంచమహల్ జిల్లా గోద్రా ప్రాంతం.

ఇద్దరు ఐఎస్ఐకు సహకరిస్తూ భారత్ లో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించారని అభియోగం ఉంది. వస్త్ర వ్యాపారం నిమిత్తం తరచూ పాకిస్థాన్ వెళ్తూ అక్కడ ఐఎస్ఐ తో సంబంధాలు ఏర్పరుచుకున్నారు. ఇక ఐఎస్ఐ చెప్పినట్లు వీరు చేసేవారని ఎన్ఐఏ గుర్తించింది. దీంతో కేసును సీరియస్ గా తీసుకున్న ఎన్ఐఏ దర్యాప్తు వేగవంతం చేసింది. వీరిని వెనుక నుంచి నడిపించింది ఎవరు? ఈ రెండు కేసుల వెనుక ఉన్న సూత్రధారి ఒకరేనా? ఇంకా ఏమైనా సామీప్యతలు ఉన్నాయా? అనే కోణాల్లో ఎన్‌ఐఏ విచారణ కొనసాగిస్తోంది.

ఇమ్రాన్‌ గిటేలీ విశాఖపట్నం గూఢచర్య రాకెట్ కేసులో నిందుతుడు.. యితడు ముందు లేడీస్ టైలర్ గా పనిచేసేవాడు.. ఆ తర్వాత ఆటో నడిపాడు. వ్యాపారం పేరుతో తరచూ కరాచీ వెళ్ళేవాడు.. అక్కడే ఐఎస్ఐ ఏజెంట్లతో సంబంధాలు పెట్టుకున్నాడు. అసఫ్ అనే వ్యక్తి నుంచి వచ్చే ఆదేశాలను పాటిస్తూ నేవీ ఉద్యుగులను ప్రలోభాలకు గురిచేసేవాడు. ఆలా విశాఖపట్నం, కార్వర్, ముంబయిలోని కేంద్రాలలో పనిచేసే కొందరు ఉద్యోగుల నుంచి సంబంధించిన వివరాలు, చిత్రాలు, వీడియోలు సేకరించి వాటిని పాకిస్థాన్‌ నిఘా విభాగానికి చేరవేసేవాడు. ఇందుకోసం సమాచారం ఇచ్చిన వారికీ పెద్ద మొత్తంలో ముడుపులు ఇచ్చేవాడు. ఇలా ఏడాది వ్యవధిలోనే రూ.65 లక్షల వరకు జమచేసినట్లు ఎన్ఐఏ గుర్తించింది.

ఇక ఇమ్రాన్ సోదరుడు కూడా ఇదే తరహాలో సైన్యం నుంచి కీలక విషయాలు సేకరించాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాపూర్‌ జిల్లాకు చెందిన సౌరభ్‌ శర్మ ఇండియన్ ఆర్మీలో పనిచేసి అనారోగ్య కారణాలతో రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఇతడికి దగ్గరైన అనస్ ఆర్మీకి సంబందించిన సమాచారం మొత్తం సేకరించాడు. దానిని ఐఎస్ఐ కి పంపాడు. సమాచారం ఇచ్చినందుకు గాను శర్మ భార్య బ్యాంకు ఖాతాకు పెద్ద మొత్తంలో డబ్బులు జమ చేశారు.

ఆర్మీ అధికారి భార్య ఖాతాలో పెద్ద మొత్తంలో డబ్బు జమవుతుండటం యూపీ ఉగ్రవాద నిరోధక బృందం అధికారులకు అనుమానం కలిగించింది. దీంతో వారు రంగంలోకి దిగి ఆధారాలు సేకరించారు. దాని ఆధారంగా ఎన్‌ఐఏ ఇటీవల కేసు నమోదు చేసి అనస్‌ను అరెస్టు చేసింది. ప్రస్తుతం అన్నదమ్ములిద్దరూ ఎన్ఐఏ కష్టడీలో ఉన్నారు. ఇద్దరే ఈ పని చేశారా? వీరి వెనుక ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో విచారణ చేపట్టారు ఎన్ఐఏ అధికారులు.