India Covid: దేశ ప్రజలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన కరోనా కేసులు.. 68రోజుల తర్వాత లక్ష లోపే..

కరోనా మహమ్మారి విలయం నుంచి దేశం కోలుకుంటోంది. కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఏప్రిల్ 2 తర్వాత తొలిసారి రోజువారీ కేసులు లక్షకు

India Covid: దేశ ప్రజలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన కరోనా కేసులు.. 68రోజుల తర్వాత లక్ష లోపే..

India Covid

India Covid : కరోనా మహమ్మారి విలయం నుంచి దేశం కోలుకుంటోంది. కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఏప్రిల్ 2 తర్వాత తొలిసారి రోజువారీ కేసులు లక్షకు తక్కువగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 18లక్షల 73వేల 485 టెస్టులు చేయగా.. 86వేల 498మందికి పాజిటివ్ వచ్చింది. మరో 2వేల 123మంది కరోనాతో చనిపోయారు. గత 24 గంటల్లో 1,82,282మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2.89కోట్లు దాటాయి(2,89,96,473). ఇప్పటివరకు 3,51,309 మంది కరోనాకు బలయ్యారు.

పాజిటివిటీ రేటు 4.62 శాతానికి పడిపోయింది. కొన్ని రోజులుగా మరణాలు కూడా తగ్గుముఖం పట్టడం ఊరటనిచ్చే అంశం. ఈ మేరకు మంగళవారం(జూన్ 8,2021) కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించింది.

యాక్టివ్ కేసులు: 13,03,702
కోలుకున్న వారు : 2,73,41,462

ఏప్రిల్ ప్రారంభం నుంచి నిత్యం లక్షకు పైగా నమోదైన కేసులు.. ఒక దశలో నాలుగున్నర లక్షలకూ చేరాయి. ఈ క్రమంలో ప్రభుత్వాలు లాక్‌డౌన్ వంటి కఠిన ఆంక్షల వైపు మొగ్గుచూపాయి. ఆ ఫలితమే ఇప్పుడు కనిపిస్తోంది. కొన్ని రోజులుగా తగ్గుతున్న కేసులు నిన్న లక్ష దిగువకు చేరాయి. పాజిటివిటీ రేటు కూడా 4.62 శాతానికి చేరింది. కొన్ని రోజులుగా మరణాల సంఖ్యా తగ్గుతూనే ఉంది.

కేసులు తగ్గడంతో పాటు రికవరీ రేటు మెరుగ్గా ఉండటం కూడా ఊరటనిస్తోంది. గత 26 రోజులుగా రోజూవారీ కేసులకంటే రికవరీలే ఎక్కువగా ఉంటున్నాయి. 24 గంటల వ్యవధిలో 1,82,282 మంది కోలుకున్నారు. మొత్తంగా వైరస్‌ను జయించినవారి సంఖ్య 2,73,41,462(94.29శాతం)కి చేరింది. యాక్టివ్ కేసులు 13లక్షలకు చేరాయి. క్రియాశీల రేటు 4.50 శాతానికి తగ్గింది.