MLC Kavitha Women Reservations Deeksha : ఢిల్లీలో కవిత మహిళా రిజర్వేషన్ల దీక్ష.. 18 పార్టీలు మద్దతు

బీఆర్ఎస్ మహిళా నేత, ఎమ్మెల్సీ కవిత భారత జాగృతి ఆధ్వర్యంలో చేపడుతున్న మహిళా రిజర్వేషన్ పై ఆందోళన, ఆమెను లక్ష్యంగా చేసుకుని ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై బీజేపీ చేస్తున్న ధర్నాతో ఢిల్లీలోని జంతర్ మంతర్ లో పొలిటికల్ జాతర కనిపిస్తోంది. ఉదయం నుంచి కవితకు మద్దతుగా పలువురు మహిళా కార్యకర్తలు వస్తున్నారు.

MLC Kavitha Women Reservations Deeksha : ఢిల్లీలో కవిత మహిళా రిజర్వేషన్ల దీక్ష.. 18 పార్టీలు మద్దతు

KAVITHA (1)

MLC Kavitha Women Reservations Deeksha : ఢిల్లీలో రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీ దీక్షలు, ధర్నాలతో దేశ రాజధానిలో పొలిటికల్ టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ముఖ్యంగా బీఆర్ఎస్ మహిళా నేత, ఎమ్మెల్సీ కవిత భారత జాగృతి ఆధ్వర్యంలో చేపడుతున్న మహిళా రిజర్వేషన్ పై ఆందోళన, ఆమెను లక్ష్యంగా చేసుకుని ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై బీజేపీ చేస్తున్న ధర్నాతో ఢిల్లీలోని జంతర్ మంతర్ లో పొలిటికల్ జాతర కనిపిస్తోంది. ఉదయం నుంచి కవితకు మద్దతుగా పలువురు మహిళా కార్యకర్తలు వస్తున్నారు. అటు బీజేపీ కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలను సమీకరిస్తోంది.

మహిళా రిజర్వేషన్ సాధనం కోసం ఎమ్మెల్సీ కవిత చేస్తున్న ఒక్క రోజు నిరాహార దీక్షకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. జంతర్ మంతర్ లో ఉదయం 11 గంటలకు కవిత దీక్ష ప్రారంభించబోతున్నారు. సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేయనున్నారు. కవిత దీక్షకు దేశంలోని 18 పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఆమెకు బాసటగా నిలిచేందుకు ఆయా పార్టీల నేతలు దీక్షలో పాల్గొంటున్నారు. సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి కవిత దీక్షను ప్రారంభిస్తారు.

Kavitha Protest In Delhi: కవితకు పోటాపోటీగా.. హైదరాబాద్, ఢిల్లీలో బీజేపీ దీక్షలు.. పూర్తి వివరాలు ఇవిగో

కవిత చేపట్టే దీక్షలో ఆప్, అకాలీదళ్, జేడీయూ, ఆర్జేడీ నేతలు పాల్గొననున్నారు. కవితకు సమాజ్ వాదీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, శివసేన(ఠాక్రే) పార్టీ సంఘీభావం ప్రకటించాయి. మహిళా బిల్లు సాధన పోరాటానికి రాష్ట్రీయ లోక్ దళ్, జార్ఖండ్ ముక్తిమోర్చా, డీఎంకే మద్దతు తెలిపాయి. కవిత దీక్ష ముగింపు సభలో సీపీఐ జాతీయ కార్యదర్వి రాజా పాల్గొంటారు.

27 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న మహిళా బిల్లును తక్షణం ఆమోదించాలని కవిత డిమాండ్ చేస్తున్నారు. వాజ్ పాయి ప్రభుత్వంలో తీసుకొచ్చిన ఈ బిల్లు ఇప్పటికీ పెండింగ్ లో ఉందన్నారు. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై హామీ ఇచ్చిన బీజేపీ తన హామీని విస్మరించిందని ఆరోపించారు.