Corona Update: తగ్గుతున్న కరోనా కేసులు, కలవరపెడుతున్న మరణాలు

ఆదివారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు దేశంలో కొత్తగా 2,09,918 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

Corona Update: తగ్గుతున్న కరోనా కేసులు, కలవరపెడుతున్న మరణాలు

Corona

Corona India: భారత్ లో కరోనా కేసులు దిగొస్తుండగా.. మరణాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు దేశంలో కొత్తగా 2,09,918 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈమేరకు సోమవారం విడుదల చేసిన Covid -19 హెల్త్ బులెటిన్ లో కేంద్ర ఆరోగ్యశాఖ వివరాలు వెల్లడించింది. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 959 మంది మహమ్మారి భారిన పడి మృతి చెందారు. దింతో ఇప్పటివరకు భారత్ లో కరోనా భారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 495050 కి చేరుకుంది. పరిస్థితి ఇలాగె కొనసాగితే మరో రెండు వారాల్లోనే భారత్ లో కరోనా మరణాలు 5 లక్షల మార్క్ దాటనుంది. ప్రస్తుతం దేశంలో 18,31,268 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక రోజువారీ పాజిటివిటీ 15.77% శాతానికి చేరుకోగా.. వారాంతపు పాజిటివిటీ రేటు 15.75% శాతానికి పడిపోయింది.

Also Read: Bank Holidays : ఫిబ్రవరిలో బ్యాంకు సెలవులు ఇవే

ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల మధ్య 2,62,628 మంది మహమ్మారి నుంచి కోలుకోగా మొత్తం ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,89,76,122కు చేరింది. దేశంలో రికవరీ రేటు 94.37% శాతానికి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో మొత్తం 13,31,198 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇప్పటి వరకు మొత్తం 72.89 కోట్ల మందికి కరోనా పరీక్షలు చేపట్టారు. దేశ వ్యాప్తంగా కరోనా వాక్సిన్ పంపిణీ కొనసాగుతుంది. ఇప్పటివరకు 166.03 కోట్ల వాక్సిన్ డోసులు వేసినట్లు కేంద్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఇంకా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 12 కోట్ల వాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నయన్న కేంద్ర వైద్యారోగ్యశాఖ.. ఆమేరకు వాటిని పంపిణీ చేయడమో లేక తిరిగి వెనక్కు ఇవ్వడమో చేయాలనీ సూచించింది.

Also read: Brazillian Patients : బ్రెజిల్‌లో విలక్షణమైన కేసులు.. ఆ ముగ్గురికి 70 రోజుల‌కుపైగా క‌రోనా పాజిటివ్‌ వస్తూనే ఉందట!

దేశంలో వేగంగా వాక్సిన్ పంపిణీ చేయడంతోనే ప్రస్తుతం ప్రమాదకర స్థాయి నుంచి బయటపడుతున్నట్లు ఐసీఎంఆర్ పేర్కొంది. సోమవారం నమోదైన కొత్త కేసులు అంతకముందు రోజుతో పోలిస్తే దాదాపు 15 శాతం తగ్గుదల కనిపిస్తుంది. మరోవైపు.. దేశంలో కరోనా తగ్గుముఖం పడుతుండడంతో పలు రాష్ట్రాలు ఆంక్షలను సడలించాయి. ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. కరోనా ముప్పు ఇంకా కొనసాగుతున్నందున ప్రజలంతా స్వీయ రక్షణ పాటించాలని.. మాస్క్ లు ధరించి, భౌతిక దూరం పాటించాలని కేంద్ర వైద్యశాఖ వెల్లడించింది