కరోనా రోగులు ఓటు వేయవచ్చు – ఎన్నికల అధికారులు

  • Published By: madhu ,Published On : September 10, 2020 / 02:15 PM IST
కరోనా రోగులు ఓటు వేయవచ్చు – ఎన్నికల అధికారులు

కరోనా సోకిన రోగులు ఓటు వేయవచ్చని ఒడిశా రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ప్రకటించారు. రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఓటింగ్ కేంద్రం వద్ద ఒక ఐసోలేషన్ సెంటర్ అందుబాటులో ఉంటుందని, ఎన్నికల పోలింగ్ ఒక గంటలో ముగుస్తుందనగా..వీరికి అనుమతివ్వడం జరుగుతుందన్నారు. చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ఎస్ కే లోహని.



బాలాసోర్, జగత్సింగ్ పూర్ జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారుల మధ్య మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో ఉప ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 29వ తేదీన బీహార్ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలతో పాటు, దేశంలో ఖాళీగా ఏర్పడిన మొత్తం 64 ఖాళీలను భర్తీ చేయడానికి ఉప ఎన్నికలు నిర్వహించాలని సెప్టెంబర్ 04వ తేదీన ఎన్నికల సంఘం నిర్ణయించింది.

బూత్ కు వేయి మంది ఓటర్లను మాత్రమే అనుమతించాలని, సోషల్ డిస్టెన్ పాటిస్తూ..ఓటింగ్ వేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధుల సంప్రదించి జిల్లా ఎన్నికల అధికారులు పోలింగ్ బూత్ లను రూపొందిస్తారని వెల్లడించారు. కరోనా వైరస్ మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని, ఓటు వేసే వారు తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందేనని స్పష్టం చేశారు అధికారులు.



పోలింగ్ స్టేషన్ లో శానిటైజన్ అందుబాటులో ఉంటుందన్నారు. ఎన్నికల తేదీని సంఘం ఎప్పుడైనా ప్రకటించవచ్చని, ఎన్నికల ఏర్పాట్లలో కరోనా వైరస్ నిబంధనలు పాటించాలని సూచించారు.
https://10tv.in/yuvraj-singh-set-to-come-out-of-retirement/
మాస్క్ ధరించడం, చేతులను శుభ్రపరుచుకోవడం, సామాజిక దూరం పాటించాలని, ఓటింగ్ సిబ్బందితో పాటు ఓటర్లకు థర్మల్ స్క్రీనింగ్ ఉంటుందన్నారు.



ఒడిశా రాష్ట్రంలోని Balasore in Balasore జిల్లా, Tirtol in Jagatsinghpur జిల్లాలో భాగమేనని అధికారులు తెలిపారు. ఈ రెండు సీట్లలోని ఎమ్మెల్యేలు చనిపోయిన సంగతి తెలిసిందే. దీనివల్ల ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. బాలాసోర్ సదర్ సీటు బీజేపీ గెలుచుకోగా, టిర్టోల్ సీటును బీజేడీ గెలుచుకుంది.