Baby Powder: జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ అమ్మకాలు వచ్చే ఏడాది నుంచి నిలిపివేత

దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ తయారు చేసే బేబీ పౌడర్ అమ్మకాలు వచ్చే ఏడాది నుంచి నిలిచిపోనున్నాయి. ఈ మేరకు సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.

Baby Powder: జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ అమ్మకాలు వచ్చే ఏడాది నుంచి నిలిపివేత

Baby Powder: చిన్న పిల్లలకు బేబీ పౌడర్ అనగానే గుర్తొచ్చేది జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ టాల్కమ్ పౌడర్. ప్రపంచవ్యాప్తంగా ఈ పౌడర్ ఆదరణ పొందింది. అయితే, వచ్చే ఏడాది నుంచి ఈ పౌడర్ అమ్మకాలను నిలిపివేయబోతున్నట్లు ప్రకటించింది జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ. ఇప్పటికే అమెరికా, కెనడాలలో వీటి అమ్మకాలు నిలిచిపోయాయి.

Divya Kakran: దివ్యా కాక్రన్ వివాదం.. ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం

ఇంతగా ప్రజాదరణ పొందిన ఈ పౌడర్ సేల్స్ కొంతకాలంగా అనుకున్నట్లుగా లేవు. దీనికి కారణం.. ఈ పౌడర్ వాడటం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని 2018లో ప్రచారం మొదలైంది. ఈ పౌడర్‌లో క్యాన్సర్ కారకమైన కార్సినోజెన్ ఉన్నట్లు తమ పరిశోధనలో తేలిందని రాయిటర్స్ సంస్థ ప్రకటించింది. దీంతో ఈ పౌడర్ వాడటం వల్ల క్యాన్సర్ వస్తుందనే ప్రచారం ఊపందుకుంది. దీనివల్ల పౌడర్ అమ్మకాలు చాలా వరకు తగ్గిపోయాయి. అయితే, తమ ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారకాలు లేవని జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ ప్రకటించింది. ఇదంతా దుష్ప్రచారమే అని చెప్పింది. ఈ అంశంపై అనేక దేశాల్లో జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థపై కేసులు నమోదయ్యాయి. అందులోనూ అమెరికాలోనే వేల కేసులు నమోదయ్యాయి.

TS EAMCET: తెలంగాణ ఎంసెట్, ఈసెట్ ఫలితాలు విడుదల.. ఏపీ విద్యార్థినికి మొదటి ర్యాంకు

దీంతో కోర్టు ఖర్చులకు కూడా సంస్థ భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో సంస్థ ఆర్థిక కష్టాల్లో ఉన్నట్లు ప్రకటించింది. ఒకవైపు తమ ఉత్పత్తిపై జరుగుతున్న ప్రచారం, మరోవైపు కోర్టు కేసులు సంస్థకు ఇబ్బందిగా మారాయి. దీంతో వచ్చే ఏడాది నుంచి ప్రపంచవ్యాప్తంగా బేబీ పౌడర్ అమ్మకాలను నిలిపి వేయనున్నట్లు సంస్థ ప్రకటించింది.