Covid Deaths : కరోనా మరణాల లెక్కలపై కేంద్రం క్లారీటీ

కొవిడ్​ మరణాలను తక్కువగా నమోదు చేస్తున్నారన్న వార్తలపై కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం క్లారిటీ ఇచ్చింది.

Covid Deaths : కరోనా మరణాల లెక్కలపై కేంద్రం క్లారీటీ

Deaths

Covid Deaths కొవిడ్​ మరణాలను తక్కువగా నమోదు చేస్తున్నారన్న వార్తలపై కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం క్లారిటీ ఇచ్చింది. అంటువ్యాధుల కట్టడి మార్గదర్శకాల ప్రకారం కొన్ని కొన్ని కరోనా కేసులను గుర్తించలేకపోయినప్పటికీ.. మరణాలను తక్కువగా నమోదు చేయడం కుదరదని పేర్కొంది. మరణాలను తక్కువగా నమోదు చేసేందుకు అవకాశమే లేదని స్పష్టం చేసింది. భారత మరణాల రిజిస్ట్రేషన్​ వ్యవస్థ పటిష్ఠంగా ఉన్నట్లు తెలిపింది.

కరోనా సెకండ్ వేవ్​ ఉద్ధృతి సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య వ్యవస్థలు సమర్థమైన ట్రీట్మెంట్ పై దృష్టిసారించాయని.. దాని ద్వారా కొవిడ్​ మరణాలను గుర్తించటం, నమోదు చేయటంలో కాస్త జాప్యం జరిగినట్లు తెలిపింది. అయితే ఆ తర్వాత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మరణాల సంఖ్యను సవరించినట్లు తెలిపింది. కోవిడ్ మరణాల సంఖ్య సవరణ ఇంకా కొనసాగుతోందని తెలిపింది. ఎనిమిది రాష్ట్రాల్లో మరణాలను తక్కువగా నమోదు చేస్తున్నారన్న వార్తలను ప్రస్తావిస్తూ.. ప్రస్తుతం ఉన్న గణాంకాలు అంచనాలు మాత్రమేనని, సరైన సమాచారం తెలియకపోవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.