Kishan Reddy: ఏ పార్టీ కేసీఆర్‌ను సీరియస్‌గా తీసుకోవడం లేదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

తెలంగాణను వదిలేసి కేసీఆర్.. ఇతర రాష్ట్రాల్లో ఎందుకు పర్యటిస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ బిహార్ పర్యటనను కిషన్ రెడ్డి తప్పుబట్టారు. కేసీఆర్ నేల విడిచి సాము చేస్తున్నారని విమర్శించారు.

Kishan Reddy: ఏ పార్టీ కేసీఆర్‌ను సీరియస్‌గా తీసుకోవడం లేదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy: దేశంలో ఏ పార్టీ కేసీఆర్‌ను సీరియస్‌గా తీసుకోవడం లేదని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ సంపదను బిహార్‌కు దోచిపెడుతున్నారని గతంలో విమర్శించిన కేసీఆర్.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని బిహార్ వెళ్లారో సమాధానం చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. న్యూఢిల్లీలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

Hey Alexa: ‘ హేయ్.. అలెక్సా’ వల్ల మారిన ‘అలెక్సా’ పేరు.. అంగీకరించిన కోర్టు

ఈ సందర్భంగా కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ‘‘సీఎం కేసీఆర్ నేలవిడిచి సాము చేస్తున్నారు. తెలంగాణకు ఎనిమిదేళ్లలో ఏదో చేసినట్లు మాట్లాడుతున్నారు. దేశమంతా తిరిగి ప్రచారం చేసుకుంటున్నారు. తెలంగాణను ఉద్ధరించా.. దేశాన్ని ఉద్ధరిస్తామంటున్నారు. కేంద్రంపై కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దేశానికి కల్వకుంట్ల కుటుంబమే దిక్కు అన్నట్లు చెబుతున్నారు. ఏ పార్టీ కేసీఆర్‌ను సీరియస్‌గా తీసుకోవడం లేదు. ప్రెస్‌మీట్‌లో కేసీఆర్ మాటలు వినలేక.. నితీష్ కుమార్ లేచి వెళ్లిపోవడం చూశాం. అందరూ తన వెనకే ఉన్నారనే భ్రమలో కేసీఆర్ ఉన్నారు. ఇద్దరు నాయకులు కలిసి కూర్చోలేని పరిస్థితి. కేసీఆర్ ప్రతిపక్ష నాయకులను ఏకం చేస్తారా? తెలంగాణ నమూనా దేశానికి ఆదర్శమని చెబుతున్నారు.

Revanth Reddy: జవాన్ల మరణాలను రాజకీయాలకు వాడుకుంటున్న కేసీఆర్: లేఖలో విమర్శించిన రేవంత్ రెడ్డి

తెలంగాణలో కేసీఆర్ నియంతృత్వ, కుటుంబ పాలన చేస్తున్నారు. అదే నియంతృత్వ పాలన దేశమంతా అమలు చేస్తారా? సమస్యలు చెప్పుకునేందుకు సీఎం అందుబాటులో ఉండరు. నెలలో 15 రోజులు ఫాంహౌజ్‌లో ఉండటమే తెలంగాణ మోడలా? బీజేపీని విమర్శించే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదు. కేసీఆర్ తెలంగాణను వదిలేసి.. ఇతర రాష్ట్రాల్లో ఎందుకు పర్యటిస్తున్నారు? మేకిన్ ఇండియాకు కేంద్రం ప్రాధాన్యమిస్తోంది. వైద్య పరికరాల దిగుమతి తగ్గించి, ఎగుమతికి కృషి చేస్తున్నాం. బొమ్మల దిగుమతి తగ్గించి, దేశీయ ఉత్పత్తికి ప్రాధాన్యమిస్తున్నాం. కేసీఆర్ మాటలు విని నితీష్ కుమార్ నవ్వుకున్నారు’’ అని కిషన్ రెడ్డి విమర్శించారు.