ఉచిత సర్వీసులు అందించండి…టెలికాం కంపెనీలను కోరిన ప్రియాంక గాంధీ

  • Published By: venkaiahnaidu ,Published On : March 30, 2020 / 11:59 AM IST
ఉచిత సర్వీసులు అందించండి…టెలికాం కంపెనీలను కోరిన ప్రియాంక గాంధీ

భారత్ లో కరోనా కేసులు వేగంగా పెరుగుతూ దేశ ప్రజానీకాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ముఖ్యంగా షట్ డౌన్ కారణంగా చాలామంది నిరుపేదలు తీవ్రఇబ్బందులకు గురౌతున్నారు. అయితే ఈ సమయంలో మొబైల్ ఫోన్ యూజర్లకు నెల రోజులపాటు ఉచితంగా ఇన్‌కమింగ్, ఔట్ గోయింగ్ కాల్స్‌ సదుపాయం కల్పించాలని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా టెలీకాం కంపెనీలను కోరారు.

ఈ మేరకు రిలయన్స్ జియో అధినేత ముకేశ్ అంబానీ, వోడాఫోన్-ఐడియా చైర్మన్ కుమారం మంగళం బిర్లా, బీఎస్ఎన్ఎల్ చైర్మన్ ప్రవీణ్ కుమార్ పుర్వార్, భారతీ ఎయిర్‌ టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్‌కు ప్రియాంక గాంధీ వేర్వేరుగా లేఖలు రాశారు. లాక్ డౌన్ కారణంగా పనులు లేక చేతిలో డబ్బులు లేకపోవడం వలస కార్మికులు గ్రామాలకు వెళ్లేందుకు ఒక ప్రధాన కారణంగా మారింది. తమ ఇంటి ఓనర్లు తమను వెళ్లగొట్టారని చాలామంది తెలిపారు.

21రోజుల లాక్‌ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది వలస కూలీలు తమ ఇళ్లకు చేరుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఆకలితో, దాహంతో, వ్యాధితో పోరాటం చేస్తున్నారు. తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఈ సమయంలో మన దేశ ప్రజలకు సాయం చేయడం మన కర్తవ్యం. ఇళ్లకు వెళ్తున్నవారిలో చాలా మంది దగ్గర డబ్బులు అయిపోతున్నాయి. రీచార్జ్ చేసుకోవడం కూడా వారికి సాధ్యపడట్లేదు. దీంతో వారు తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేయడం, వారి నుంచి కాల్స్ అందుకోవడం కుదరట్లేదు. అందువల్ల వచ్చే నెల రోజులపాటు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకుండా ఇన్‌కమింగ్, ఔట్ గోయింగ్ కాల్స్ అందించాలని కోరుతున్నా. దీని వాళ్ల ఇబ్బందులు పడుతున్న వారు తమ కుటుంబీకులతో మాట్లాడుకోవడానికి సాయం చేసినట్లు అవుతుంది. వారి ముఖంలో ఉన్న భయాన్ని, అనిశ్చితిని తొలగించడానికి ఈ చర్య దోహదం చేస్తుందని ప్రియాంక గాంధీ టెలీకాం సంస్థల అధిపతులను కోరారు.

లాక్ డౌన్ కారణంగా పనులు లేక చేతిలో డబ్బులు లేకపోవడం వలస కార్మికులు గ్రామాలకు వెళ్లేందుకు ఒక ప్రధాన కారణంగా మారింది. తమ ఇంటి ఓనర్లు తమను వెళ్లగొట్టారని చాలామంది తెలిపారు. ఈ లాక్ డౌన్ సమయంలో ఇంటి అద్దెను కూలీల నుండి డిమాండ్ చేయరాదని, కార్మికులు లేదా విద్యార్థులను ప్రాంగణం నుండి ఖాళీ చేయమని అడుగుతున్న వారిపై చర్యలు తీసుకోబడతాయని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది.