రేపటి నుంచే తెలంగాణలో కరోనా టీకా..ఎలా వేయించుకోవాలి..తెలుసుకోవాల్సిన విషయాలు

రేపటి నుంచే తెలంగాణలో కరోనా టీకా..ఎలా వేయించుకోవాలి..తెలుసుకోవాల్సిన విషయాలు

Corona vaccine : తెలంగాణ రాష్ట్రంలో కరోనా టీకా పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఫ్రంట్ లైన్ వారియర్స్ కు టీకా వేసిన సంగతి తెలిసిందే. 2021, మార్చి 01వ తేదీ సోమవారం నుంచి 60 ఏళ్లు పైబడిన వారు, 45 నుంచి 59 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు వెల్లడించారు.

cowin.gov.in (కోవిన్ వెర్షన్ 2) అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. 102 కేంద్రాల్లో వాక్సినేషన్ చేస్తామని, 45 ప్రభుత్వ కేంద్రాల్లో వ్యాక్సిన్ చేస్తామన్నారు. ప్రతి జిల్లాల్లో 2 , హైదరాబాద్ లోని 12 కేంద్రాల్లో వాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రైవేట్ లో 57 ప్రైవేట్ లో వాక్సినేషన్ ఉంటుందన్నారు. ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే వాక్సినేషన్ చేస్తామన్నారు.

కోవిన్ 2.0 వెబ్ సైట్ లో మొబైల్ లేక ఆధార్ నెంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు అని తెలిపారు. ఆధార్ లేక ఫోన్ నెంబర్ ఇస్తే ఓటిపి వస్తుంది. దానిని వెబ్ సైట్ లో ఎంటర్ చేసి డీటెయిల్స్ రిజిస్టర్ చేసుకోవచ్చన్నారు. రిజిస్ట్రేషన్ తరువాత మీ మొబైల్ కి వచ్చిన లింక్ ద్వారా మీ దగ్గరలో ఉన్న వ్యాక్సిన్ కేంద్రంలో టీకా వేసుకోవచ్చన్నారు. అదే వ్యాక్సిన్ కేంద్రాల్లో రెండో డోస్ కోసం డేట్ ఫిక్స్ చేసుకోవచ్చని తెలిపారు. అంతేగాకుండా…మొబైల్ లింక్ ద్వారా వాక్సినేషన్ సర్టిఫికెట్ పొందవచ్చని, covin.gov. in లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు.