Data Entry Job : ఆన్‌లైన్ డేటా ఎంట్రీ జాబ్.. మేసేజ్ వచ్చిందా? మీకు మూడినట్టే..

మన అవసరాలు, బలహీనతలే వారికి పెట్టుబడి. జస్ట్ ఓ మేసేజ్ పంపిస్తారు అంటే.. ఆ తర్వాత అడ్డంగా దోచేస్తారు. తాజాగా నిరుద్యోగ యువతను సైబర్ క్రిమినల్స్ లక్ష్యంగా చేసుకున్నారు. జాబ్ పేరుతో

10TV Telugu News

Data Entry Job : సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులను టార్గెట్ గా చేసుకుని డబ్బులు దండుకుంటున్నారు. మన అవసరాలు, బలహీనతలే వారికి పెట్టుబడి. జస్ట్ ఓ మేసేజ్ పంపిస్తారు అంటే.. ఆ తర్వాత అడ్డంగా దోచేస్తారు. తాజాగా నిరుద్యోగ యువతను సైబర్ క్రిమినల్స్ లక్ష్యంగా చేసుకున్నారు. జాబ్ పేరుతో ఊరిస్తారు. వారి మాయలో పడ్డామా? ఇక అంతే సంగతలు. బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకుంటారు.

Bra : వార్నీ.. పిచ్చ కామెడీ.. సాక్స్ ఆర్డర్ చేస్తే బ్రా వచ్చింది..

తాజాగా ఇలాంటి మోసాలకు సంబంధించిన సైబరాబాద్ పోలీసులు పౌరులను అలర్ట్ చేశారు. వారిలో చైతన్యం నింపే ప్రయత్నం చేశారు. మోసగాళ్ల బారిన పడకుండా, డబ్బు కోల్పోకుండా ఉండేందుకు జాగ్రత్తలు చెప్పారు. ఆన్ లైన్ డేటా ఎంట్రీ ఉద్యోగం అంటూ సైబర్ నేరగాళ్లు నిరుద్యోగ యువతకు గాలం వేస్తున్నారని పోలీసులు హెచ్చరించారు. అలాంటి మేసేజ్ లు వస్తే స్పందించొద్దని, అదంతా మోసమని సైబరాబాద్ పోలీసులు ట్వీట్ చేశారు. అసలు సైబర్ క్రిమినల్స్ ఏ విధంగా మోసం చేస్తారో వివరించారు.

Free Wi-Fi: ఉచిత వైఫై వాడుతున్నారా? రిస్క్ చేస్తున్నట్లే.. తస్మాత్ జాగ్రత్త!!

”ఉద్యోగం పేరుతో ముందుగా అగ్రిమెంట్ రాయించుకుంటారు. ఆ తర్వాత జాబ్ సరిగా చేయడం లేదని కేసులు పెడతామని బెదిరిస్తారు. అంతేకాదు నకిలీ కోర్టు నోటీసులు పంపించి డబ్బులు డిమాండ్ చేస్తారు” అని పోలీసులు వివరించారు. సో, డేటా ఎంట్రీ జాబ్ పేరుతో వచ్చే మేసేజ్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. డబ్బు అవసరం ఉందనో, జాబ్ అవసరం ఉందనో లేక మరో కారణంతోనో అలాంటి మేసేజ్ లకు స్పందిస్తే.. భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని పోలీసులు హెచ్చరించారు.

Harvard Professor: మనుషులంతా ఏలియన్లు చేసిన ప్రయోగమే.. – హార్వర్డ్ ప్రొఫెసర్