Eatala Rajender: ఎన్నికలొస్తేనే కేసీఆర్‌కు ప్రజలు గుర్తుకొస్తారు.. మునుగోడు హామీల అమలేది: ఈటల రాజేందర్

కేసీఆర్‌కు ఓట్ల మీదనే ప్రేమ అనడానికి సజీవ సాక్ష్యం మునుగోడు ఎన్నికలు. ఎక్కడా మీ మునుగోడు హామీలు? గత బడ్జెట్‌లో రూ.17660 కోట్లు దళిత బంధుకు కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు మరో మోసం. గొల్ల కురుమల కోసం ఖర్చు పెట్టిన రూ.4000 కోట్లలో సగం డబ్బులు బ్రోకర్ల పాలయ్యాయి.

Eatala Rajender: ఎన్నికలొస్తేనే కేసీఆర్‌కు ప్రజలు గుర్తుకొస్తారు.. మునుగోడు హామీల అమలేది: ఈటల రాజేందర్

Eatala Rajender: ఎన్నికలు వస్తేనే తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ప్రజలు గుర్తుకు వస్తారని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘‘ఎన్నికలు వస్తేనే కేసీఆర్‌కు ప్రజలు గుర్తుకు వస్తారు.

Pan-Aadhaar Link: గుడ్ న్యూస్.. పాన్-ఆధార్ లింక్ గడువు పెంపు.. ఈ సారి ఎప్పటివరకంటే!

గొల్ల కురుమలకు గొర్లు ఇస్తా అని మోసం చేశారు. కేసీఆర్‌కు ఓట్ల మీదనే ప్రేమ అనడానికి సజీవ సాక్ష్యం మునుగోడు ఎన్నికలు. ఎక్కడా మీ మునుగోడు హామీలు? గత బడ్జెట్‌లో రూ.17660 కోట్లు దళిత బంధుకు కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు మరో మోసం. గొల్ల కురుమల కోసం ఖర్చు పెట్టిన రూ.4000 కోట్లలో సగం డబ్బులు బ్రోకర్ల పాలయ్యాయి. డబుల్ బెడ్ రూమ్ ఎందుకు ఇవ్వలేదు.. మిషన్ భగీరథ నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదు.. మిషన్ భగీరథ నీళ్ళు తాగడానికి పనికిరావడం లేదు. మళ్లీ మినరల్ వాటర్ ప్లాంట్‌కి గిరాకీ పెరిగింది.. చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు లేవు. 2011లో గ్రూప్ 1 వేస్తే 13 ఏళ్లకు మళ్లీ మొన్న వేశారు.

Amaravati Capital Issue: అమరావతి రాజధాని కేసులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. విచారణ జూలైకి వాయిదా

రెండవసారి కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు. టీఎస్‌పీఎస్‌సీలో నాలుగు పరీక్షలు నిర్వహిస్తే అన్నీ లీక్ అయ్యాయి. ఉద్యోగాలు భర్తీ చేసే టీఎస్‌పీఎస్‌సీలో కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులను పెడుతున్నారు. 2015లో ఎంసెట్ పేపర్ లీక్ అయ్యింది. దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం అబాసు పాలైంది. 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.

పేపర్ లీక్‌లో దోషి ప్రభుత్వం. భాధ్యత వహించాల్సింది తెలంగాణ ప్రభుత్వం. జైల్లో ఉండాల్సింది పేపర్ లీక్ చేసిన వారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందపెట్టాలని ప్రజలు చూస్తున్నారు. కేసిఆర్ మాయల మరాఠీ.. తెలంగాణ మహిళగా ఢిల్లీ పోయి లిక్కర్ అమ్మే వ్యాపారం చేయొచ్చా? తప్పు చేయని వారు అయితే విచారణకు సహకరించండి. సారా వ్యాపారానికి, తెలంగాణ ప్రజలకు ఏమన్నా సంబంధం ఉందా? తప్పు చేస్తే శిక్ష తప్పదు. చేయకపోతే బయటికి వస్తారు’’ అని ఈటల వ్యాఖ్యానించారు.