Statue Of Equality : ముచ్చింతల్‌‌కు మెగాస్టార్.. భగవత్‌ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించారు. 216 అడుగుల శ్రీరామానుజ విగ్రహం, 108 దివ్యదేశాలను దర్శించుకున్నారు. శ్రీరామానుజాచార్యుల విగ్రహాన్ని చూసి...

Statue Of Equality : ముచ్చింతల్‌‌కు మెగాస్టార్.. భగవత్‌ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు

Mega Star

Mega Star Chiranjeevi : ముచ్చింతల్ శ్రీ భగవత్‌ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. శనివారం 11వ రోజు యదావిధిగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 261 అడుగుల సువర్ణ సమతామూర్తిని, యాగశాలలో నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాలో సినీ, రాజకీయ ఇతర రంగాలకు చెందిన వారు పాల్గొంటున్నారు. ప్రముఖులే కాకుండా దేశ వ్యాప్తంగా భక్తులు తరలివస్తున్నారు. 2021, ఫిబ్రవరి 12వ తేదీ శనివారం సమతామూర్తి కేంద్రాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, మెగాస్టార్ చిరంజీవి దర్శించుకోనున్నారు.

Read More : Sammakka Saralamma : మేడారం జాతర.. హెలికాప్టర్ సేవలు, రూ. 20 వేల చార్జీ

ఇక శుక్రవారం స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించారు. 216 అడుగుల శ్రీరామానుజ విగ్రహం, 108 దివ్యదేశాలను దర్శించుకున్నారు. శ్రీరామానుజాచార్యుల విగ్రహాన్ని చూసి… అల్లు అర్జున్‌ ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. తన సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీసుకున్నారు. అనంతరం 3డీ షోను తిలకించి.. బన్నీ సంతోషం వ్యక్తం చేశారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌స్వామిజీ అల్లు అర్జున్‌కు మంగళా శాసనాలు అందించారు. సమతామూర్తి కేంద్రానికి రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నానన్నారు బన్నీ.

Read More : Virat Kohli: కోహ్లీ సంతకం చేసిన బ్యాట్ ను ఆస్ట్రేలియా లీడర్ కు బహుకరించిన విదేశాంగ శాఖ మంత్రి

11వ రోజు జరిగే కార్యక్రమాలు :-
ఉదయం 6.30 అష్టాక్షరీ కోటి మంత్ర పఠనం
ఉదయం 7.30 కి శ్రీరామ పెరుమాళ్ స్వామికి ప్రాతకాల ఆరాధన
ఉదయం 8 గంటలకు వేద పారాయణం
ఉదయం 9.15 గంటలకు శ్రీ లక్ష్మీ నారాయణ మహా యజ్ఞం.

Read More : Statue of Equality : 11వ రోజు రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాలు.. ఇవాళ ఉప రాష్ట్రపతి రాక

ఉదయం 10 గంటలకు ఇష్టి శాలలో వ్యాధి నివారణకు, సంపూర్ణ ఆరోగ్యం కోసం పరమేష్ఠి
ఉదయం10 గంటలకు విజ్ఞ దోష నివారణ, పితృదేవతల తృప్తి కోసం వైభవేష్టి
ఉదయం 10.30 కి ప్రవచన మండపంలో శ్రీ వాసుదేవ అష్టోత్తర పూజ

Read More : Telangana Corona Cases : తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు

మధ్యాహ్నం 12.30 కి పూర్ణాహుతి
మధ్యాహ్నం 2.30కి ప్రవచన మండపంలో ప్రముఖులచే ప్రవచనాలు, కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు.
సాయంత్రం 5 గంటలకు శ్రీ లక్ష్మీ నారాయణ మహా యజ్ఞం
రాత్రి 9 గంటలకు పూర్ణాహుతి