Srinivas Goud: 12గంటలకు పబ్‌లు క్లోజ్ చెయ్యాల్సిందే.. సీసీటీవీ కెమెరాలు లేకుంటే సీజ్ చేస్తాం ..

హైదరాబాద్‌లో మొత్తం 61 పబ్స్ ఉన్నాయి.. ప్రతి పబ్‌లో సీసీ టీవీ కెమెరా మస్ట్‌గా ఉండాలి.. సీసీటీవీ కెమెరాలు లేని పబ్ లను వెంటనే సీజ్ చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ..

Srinivas Goud: 12గంటలకు పబ్‌లు క్లోజ్ చెయ్యాల్సిందే.. సీసీటీవీ కెమెరాలు లేకుంటే సీజ్ చేస్తాం ..

Srinivas Goud

Srinivas Goud: హైదరాబాద్‌లో మొత్తం 61 పబ్స్ ఉన్నాయి.. ప్రతి పబ్‌లో సీసీ టీవీ కెమెరా మస్ట్‌గా ఉండాలి.. సీసీటీవీ కెమెరాలు లేని పబ్ లను వెంటనే సీజ్ చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం పబ్స్  యాజమానులతో మంత్రి సమావేశమయ్యారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. శుక్ర, శనివారాల్లో మినహా మిగిలిన అన్ని రోజుల్లో రాత్రి 12గంటలకే పబ్ లు క్లోజ్ అవ్వాలని, శుక్ర, శని వారాల్లో 1గంట వరకు నడుపుకోవచ్చని తెలిపారు. పబ్ లలో ఏర్పాటు చేసిన కెమెరాలను ఎక్సైజ్ శాఖకు అనుసంధానం చేయాలని అన్నారు. పబ్ లలో సౌండ్ సిస్టం ఇతరులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు.

Hyd Pubs : పుడ్డింగ్ ఇన్ మింక్ పబ్ ఆదాయం ఎంతో తెలుసా ?

24 గంటలు లైసెన్స్ తీసుకున్న బార్లు కేవలం సర్వీస్ మాత్రమే చేయాలని, ఈవెంట్స్ రన్ చెయ్యడానికి కాదు అని మంత్రి అన్నారు. పబ్ నిర్వాకులను పదే పదే అధికారులు వేదించరని, తప్పుచేస్తే మాత్రం ఎవ్వరిని వదిలి పెట్టమని, ఇది పార్టీలకు సంబంధం కాదని, హైదరాబాద్ బ్రాండ్ కు సంబంధించిన అంశమని మంత్రి అన్నారు. పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ లో అసలు నిందితులను మాత్రమే పట్టుకున్నామన్న మంత్రి.. వారిపై మాత్రమే చర్యలు తీసుకుంటామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం లో మాదక ద్రవ్యాలను పూర్తిగా నిర్ములించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

Hyd Pubs : పక్కా ప్లాన్‌‌తో పబ్‌‌పై దాడులు.. వారం పాటు టాస్క్‌‌ఫోర్స్ రెక్కీ

హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటే రాష్ట్రానికి పెట్టబడులు వస్తాయని మంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇండియాలో నెం.1 రాష్ట్రంగా చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కొంతమంది డబ్బులకు కక్కుర్తి పడి చెడు పనులు చేస్తూ రాష్ట్రానికి చెడ్డపేరు తీసుకొస్తున్నారని, డ్రగ్స్ వ్యాపారం చేసిన వారిపై పీడీ యాక్ట్ లు నమోదు చేస్తామని, అవసరమైతే నగర బహిష్కరణ చేస్తామని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.