Revanth Reddy Key Comments : కాంగ్రెస్‌లో పీకే చేరిక, టీఆర్ఎస్‌తో పొత్తుపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) కాంగ్రెస్ లో చేరిక, తెలంగాణలో టీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తుపై అంశాలపై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Revanth Reddy Key Comments : కాంగ్రెస్‌లో పీకే చేరిక, టీఆర్ఎస్‌తో పొత్తుపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Revanth Reddy Key Comments

Revanth Reddy Key Comments : ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) కాంగ్రెస్ లో చేరిక, తెలంగాణలో టీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తుపై అంశాలపై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పీకేను కాంగ్రెస్ లో చేర్చుకునే అంశం జాతీయ స్థాయిలో తీసుకునే నిర్ణయం అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో చేరడానికి పీకే సుముఖతను వ్యక్తం చేశారని రేవంత్ రెడ్డి తెలిపారు. పీకేను పార్టీలో చేర్చుకునే విషయంలో హైకమాండ్ కమిటీ వేసిందన్నారు. కాగా, మోదీతో జట్టుకట్టిన ఏ పార్టీతోనూ ఒప్పందాలు ఉండవద్దని, అలా అయితేనే కాంగ్రెస్ లో చేర్చుకుంటామని పీకే కు కాంగ్రెస్ మైకమాండ్ కండీషన్ పెట్టిందని రేవంత్ రెడ్డి తెలిపారు.

congress: ఓడిపోయే పార్టీతో కాంగ్రెస్ ఎందుకు కలుస్తుంది: మహేష్ గౌడ్

టీఆర్ఎస్ తో ఒప్పందం తెగదెంపులు చేసుకోవడానికే సీఎం కేసీఆర్ తో ప్రశాంత్ కిశోర్ ప్రగతిభవన్ లో చర్చలు జరిపారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. కాగా, కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత పీకే వ్యూహకర్త కాదని కార్యకర్త అవుతారని అన్నారు. కేసీఆర్ ను ఓడించే శక్తి కాంగ్రెస్ కి మాత్రమే ఉందన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ను కాంగ్రెస్ నమ్మదన్న రేవంత్ రెడ్డి, ఆ పార్టీతో పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. గతంలో మాదిరి టీఆర్ఎస్ దొంగల గుంపుతో జట్టు కట్టే పరిస్థితి లేదని రాహుల్ గాంధీ అన్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ఇవ్వడంతో ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందన్నారు.(Revanth Reddy Key Comments)

telangana congress: ప్రశాంత్ కిషోర్ విషయం హైకమాండ్ చూసుకుంటుంది: భట్టి విక్రమార్క

ఏప్రిల్ లో తెలంగాణలో ఎన్నికలు వస్తాయన్న రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని జోస్యం చెప్పారు. 90 సీట్లతో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారాయన.

టీఆర్ఎస్ తో పొత్తులపైనా రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. టీఆర్ఎస్ పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందన్నారు. తప్పుడు ప్రచారాలను కాంగ్రెస్ శ్రేణులు నమ్మవద్దని రేవంత్ రెడ్డి కోరారు. ఈసారి కచ్చితంగా కేసీఆర్ ను ఓడించి తీరుతామని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Revanth Reddy : టీఆర్ఎస్ తో తెగదెంపులు చేసుకునేందుకే పీకే కేసీఆర్ ను కలిశారు : రేవంత్ రెడ్డి

సీఎం కేసీఆర్‌తో పీకే భేటీపైనా రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ తో తెగదెంపులు చేసుకునేందుకే పీకే కేసీఆర్‌ను కలిశారని చెప్పారు. ఇక టీఆర్ఎస్, ఐప్యాక్‌తో పీకేకు ఎలాంటి సంబంధం ఉండదన్నారు. తాను ముందు నుంచి చెప్పిందే ఇప్పుడు జరిగిందన్నారు. పీకే కాంగ్రెస్‌లో చేరిన తర్వాత రాష్ట్రానికి వచ్చి తనతో ఉమ్మడి ప్రెస్‌మీట్‌ పెట్టే రోజు దగ్గర్లోనే ఉందని రేవంత్‌ చెప్పారు. ఆ రోజు టీఆర్ఎస్ ను ఓడించండని స్వయంగా పీకే నోటి నుంచి చెప్పడం వింటారని అన్నారు. పీకే కాంగ్రెస్‌లో చేరాక ఆయనకు పార్టీ అధిష్ఠానం మాటే ఫైనల్‌ అని రేవంత్‌ తేల్చి చెప్పారు.

ఇటీవ‌లి కాలంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ ప‌లుమార్లు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ విజ‌యానికి ప‌లు వ్యూహాల‌ను ఆయ‌న సోనియాకు అందించార‌ని ప్ర‌చారం సాగుతోంది. ఈ క్ర‌మంలో తెలంగాణ‌లో టీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు ఖాయ‌మ‌న్న వార్త‌లు రెండు రోజులుగా వినిపిస్తున్నాయి. ఈ వార్త‌లతో కాంగ్రెస్ శ్రేణుల్లో అయోమ‌యం నెల‌కొన‌గా… దానిపై క్లారిటీ ఇచ్చే దిశ‌గా తాజాగా రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

కాగా, తాను కాంగ్రెస్‌లో చేరినా తన ఐప్యాక్‌ సంస్థ టీఆర్ఎస్ కోసం పనిచేస్తుందని ప్రగతిభవన్‌లో రెండు రోజుల భేటీ అనంతరం కేసీఆర్‌కు పీకే తెలిపారు. ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తే కాంగ్రెస్‌ను కలుపుకుని వెళ్లే విషయంపై ఆలోచించాలని కోరారు. బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకమైతేనే ఆ పార్టీని ఓడించగలమని పీకే సూచించినట్లు తెలిసింది.