Revanth Reddy : టీఆర్ఎస్ తో తెగదెంపులు చేసుకునేందుకే పీకే కేసీఆర్ ను కలిశారు : రేవంత్ రెడ్డి

ఇక ప్రశాంత్ కిషోర్ కు టీఆర్ఎస్ కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అలాగే ఐ ప్యాక్ కు పీకేకు కూడా ఇక ఎలాంటి సంబంధం ఉండదని తేల్చి చెప్పారు.

Revanth Reddy : టీఆర్ఎస్ తో తెగదెంపులు చేసుకునేందుకే పీకే కేసీఆర్ ను కలిశారు : రేవంత్ రెడ్డి

Revanth (1)

TPCC Revanth Reddy : రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, సీఎం కేసీఆర్ భేటీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. టీఆర్ఎస్ తో తెగదెంపులు చేసుకునేందుకే పీకే కేసీఆర్ ను కలిశారని తెలిపారు. ఇక ప్రశాంత్ కిషోర్ కు టీఆర్ఎస్ కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అలాగే ఐ ప్యాక్ కు పీకేకు కూడా ఇక ఎలాంటి సంబంధం ఉండదని తేల్చి చెప్పారు. తాను ముందు నుంచి చెప్పిందే ఇప్పుడు జరిగిందన్నారు. పీకే కాంగ్రెస్ లో చేరాక రాష్ట్రానికి వచ్చి తనతో కలిసి ఉమ్మడి ప్రెస్ మీట్ కూడా పెట్టే రోజు దగ్గరలోనే ఉందన్నారు. ఆ రోజు పీకే స్వయంగా టీఆర్ఎస్ ను ఒడించండని ఆయన నోటి నుంచి చెప్పడం మీరు వింటారు అని అన్నారు. పీకే కాంగ్రెస్ లో చేరాక ఆయనకు పార్టీ అధిష్టానం మాటనే ఫైనల్ అని పేర్కొన్నారు.

ఇదిలావుంటే కేసీఆర్ తో పీకే సమావేశం నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్యం టాగోర్ వరుస ట్వీట్లు చేస్తున్నారు. ప్రశాంత్ కిశోర్ టీమ్ టీఆర్ఎస్‌తో కలసి పనిచేయడంపై పరోక్షంగా కామెంట్లు చేశారు. ఈ సందర్భంలోనే మాణిక్కం ఠాగూర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. శత్రువుతో స్నేహం చేసే వాళ్లను నమ్మవద్దు అన్న కోట్‌ను షేర్ చేస్తూ… ఇది కరెక్టేనా అంటూ ప్రశ్నించారు. ‘చిట్టచివరి అవకాశం కూడా ఉన్నంతవరకు నేను ఆశను వదులుకోను’ అనే మహాత్మ గాంధీ కొటేషన్‌ను మాణిక్యం ఠాగూర్‌ ట్వీట్ చేశారు. మాణిక్యం టాగోర్ వరుస ట్వీట్లపై ఏఐసీసీలో చర్చ జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు టీఆర్‌ఎస్‌ను రాజకీయ శత్రువుగా చూస్తున్న సమయంలో… పీకే టీఆర్ఎస్‌తో కలిసి పనిచేయాలనుకోవడం..ఈసమయంలోనే మణిక్కం ఠాగూర్‌ ఇలా ట్వీట్ చేయడం ఆసక్తిగా మారింది.

Manickam Tagore : కేసీఆర్ తో పీకే సమావేశం నేపథ్యంలో మాణిక్యం ఠాగూర్ ఆసక్తికర ట్వీట్

మరోవైపు రాజకీయ పార్టీల కోసం ప్రశాంత్ కిషోర్, ఐపాక్ టీమ్ వేరు వేరుగా పనిచేయనున్నాయి. సోనియాగాంధీ నిర్ణయం ప్రకారం కాంగ్రెస్ లో పీకే చేరికపై స్పష్టత రానున్నది. పీకే వేరు..ఐపాక్ వేరు అనే దిశగా రాజకీయ పార్టీలకు పీకే సంకేతాలిస్తున్నారు. కాంగ్రెస్ లో చేరికకు ముందే ఇతర తన ఐపాక్ టీమ్ పనిచేసే రాజకీయ పార్టీల అధినేతలను కలిసి ఎన్నికల వ్యూహాలపై పీకే స్పష్టత ఇస్తున్నారు. శని, ఆది వారాల్లో కేసీఆర్ తో ప్రశాంత్ కిషోర్ సమావేశమయ్యారు. తెలంగాణలో ఐపాక్ బృందం చేసిన సర్వేల వివరాలు, ఎన్నికల వ్యూహాలను కేసీఆర్ కు తెలిపారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రచారానికి ఐ-ప్యాక్‌తో టీఆర్ఎస్ ఒప్పందం కుదుర్చుకున్నది. 2023 ఎన్నికల కోసం టీఆర్ఎస్ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (I-PAC)తో ఒప్పందం కుదుర్చుకుందని కేటీఆర్ ధృవీకరించింది. I-PAC అధికారికంగా తమ కోసం పని చేస్తోందన్నారు. ప్రశాంత్ కిషోర్‌తో కలిసి పనిచేయడం లేదు., కానీ ఐ-పీఏసీతో కలిసి పనిచేస్తున్నామని కేటీఆర్ తెలిపారు.

Prashant Kishore : కాంగ్రెస్ కు పీకే, టీఆర్ఎస్ కు ఐపాక్ !

పీకే టీమ్ టీఆర్ఎస్ కోసం పనిచేస్తుండటంపై కాంగ్రెస్ నేతలు అయోమయంలో ఉన్నారు. రేపోమాపో పీకే కాంగ్రెస్ కండువా కప్పుకుంటారనుకుంటున్న సమయంలో ప్రత్యర్థి పార్టీతో కలిసి ఆయన పనిచేయడాన్ని టీ కాంగ్రెస్ నేతలుః జీర్ణించుకోలేకపోతున్నారు. వచ్చే ఎన్నికల కోసం ప్రశాంత్ కిశోర్ టీఆర్ఎస్‌తో డీల్ కుదుర్చుకోవడంతో తెలంగాణ కాంగ్రెస్ లో అయోమయ వాతావరణం కనిపిస్తోంది.