CM KCR : రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవ ఏర్పాట్లకు సహాయ సహకారాలు అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశం

భగవత్ శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవ ఏర్పాట్లకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని అధికార యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

CM KCR : రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవ ఏర్పాట్లకు సహాయ సహకారాలు అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశం

Cm Kcr Samatha Murthy Statue K

CM KCR : భగవత్ శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవ ఏర్పాట్లకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని అధికార యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. శంషాబాద్ ముచ్చింతల్ లోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమాన్ని కేసీఆర్ సందర్శించారు. భగవత్ శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఉత్సవాలకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని సీఎస్ ను ఆదేశించారు సీఎం కేసీఆర్.

Xiaomi 11i Offer: రూ. 867కే Xiaomi 11i స్మార్ట్‌ఫోన్‌ పొందవచ్చు.. ఆఫర్ తెలుసుకోండి!

విద్యుత్ కి సంబంధించిన ఏర్పాట్లను వెంటనే చేయాలని ఆదేశించిన కేసీఆర్ అదనపు ట్రాన్స్ ఫార్మర్లు అందుబాటులో ఉంచాలన్నారు. టీఎస్ఎస్ పీడీసీఎల్ సీఎండీ రఘురామరెడ్డితో ఫోన్ లో మాట్లాడిన కేసీఆర్ యాగం సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. యాగశాలకు మిషన్ భగీరథ నీరు అందించాలన్నారు కేసీఆర్.

Lemon Water : మోతాదుకు మించి నిమ్మరం తీసుకుంటున్నారా?.. అయితే జాగ్రత్త!..

ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు భగవత్ శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 5న ప్రధాని చేతుల మీదుగా సమతామూర్తి విగ్రహావిష్కరణ జరుగుతుంది. ఫిబ్రవరి 14న జరిగే ముగింపు వేడుకల్లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింగ్ పాల్గొంటారు.