Telangana Lockdown : తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగింపు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన లాక్ డౌన్ ను ఈ నెలాఖ‌రు వ‌ర‌కు పొడిగించింది. ఈ నెల 12 నుంచి తెలంగాణ‌లో లాక్ డౌన్ కొన‌సాగుతున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ను మే 30 వరకు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న నిబంధనలే వర్తించనున్నాయి. లాక్ డౌన్ పొడిగింపుతో ఈ నెల 20న నిర్వహించాల్సిన కేబినెట్‌ సమావేశం రద్దైంది.

Telangana Lockdown : తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగింపు

Telangana Lockdown

Telangana Lockdown : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన లాక్ డౌన్ ను ఈ నెలాఖ‌రు వ‌ర‌కు పొడిగించింది. ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు అంటే 20 గంటలు లాక్ డౌన్ అమల్లో ఉంటుంది. నిత్యావసర కార్యకలాపాలకు ప్రభుత్వం 4(ఉదయం 6 నుంచి 10 వరకు) గంటలు వెసులుబాటు కల్పించింది. ఈ నెల 12 నుంచి తెలంగాణ‌లో లాక్ డౌన్ కొన‌సాగుతున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ను మే 30 వరకు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న నిబంధనలే వర్తించనున్నాయి. లాక్ డౌన్ పొడిగింపుతో ఈ నెల 20న నిర్వహించాల్సిన కేబినెట్‌ సమావేశం రద్దైంది.

మంగళవారం(మే 18,2021) మంత్రులందరితో ఫోన్ లో మాట్లాడి లాక్ డౌన్ పొడిగింపుపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు సీఎం కేసీఆర్. అనంతరం మే 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జీవోను విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను సీఎం ఆదేశించారు. తొలుత ఈ నెల 21వ‌ర‌కు లాక్ డౌన్ విధించింది తెలంగాణ స‌ర్కార్. లాక్‌డౌన్‌ విధించిన తర్వాత రాష్ట్రంలో క‌రోనా కేసులు అనూహ్యంగా తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ సమయంలో నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 71వేల 616 కరోనా పరీక్షలు చేయగా కొత్తగా 3వేల 982 కరోనా కేసులు బయటపడ్డాయి. మరో 27 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. కరోనా నుంచి 5వేల 186 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో పాజిటివ్ రేటు 0.56శాతంగా నమోదవ్వగా.. రికవరీ రేటు 90.47 శాతంగా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 48,110 యాక్టివ్ కేసులున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 607 కరోనా కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం:
తెలంగాణలో గత రెండు వారాలుగా కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీ‌నివాస‌రావు అన్నారు. కొవిడ్ నియంత్ర‌ణ‌కు తెలంగాణ వైద్యారోగ్య‌శాఖ చేప‌ట్టిన చ‌ర్య‌లు స‌త్ఫ‌లితాలు ఇస్తున్నాయ‌ని.. కొవిడ్ క‌ట్ట‌డికి తెలంగాణ మార్గ‌ద‌ర్శిగా మారింద‌ని ఆయన తెలిపారు.

ఇంటింటి స‌ర్వే ద్వారా క‌రోనా బాధితుల‌ను గుర్తించి మందులు అంద‌జేస్తున్న‌ట్లు ఆయన చెప్పారు. చికిత్స అవ‌స‌రం ఉన్న‌వారిని ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. గ్రామాల్లో కొవిడ్ నియంత్ర‌ణ‌లోనే ఉంద‌న్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం రికవరీ రేటు 90.48 గా ఉందని… రెండో దశలో ఇప్పటి వరకు రాష్ట్రంలో 2.37 లక్షల కేసులు నమోదయ్యాయని ఆయన వివరించారు. ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించడం వల్లనే సత్ఫలితాలు వస్తున్నాయన్నారు.

కోవిడ్ రోగుల కోసం రాష్ట్రంలో ప్రభుత్వ‌, ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో స‌రిపడ ప‌డ‌క‌లు ఉన్నట్లు తెలిపారు. 40 శాతానికి పైగా ప‌డ‌క‌లు ఇత‌ర రాష్ట్రాల రోగుల‌తో నిండాయన్నారు. రాష్ట్రంలో ఆక్సిజ‌న్ ప‌డ‌క‌లు 33 శాతం ఖాళీగా ఉన్న‌ట్లు శ్రీనివాసరావు చెప్పారు. రాష్ట్రంలో 1,265 ఆస్ప‌త్రుల్లో కొవిడ్ చికిత్స‌లు అంద‌జేస్తున్న‌ట్లు వివ‌రించారు.