corona control restrictions : కరోనా నియంత్రణకు టీ.సర్కార్ ఆంక్షలు…మాస్క్ లు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు

కరోనా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కేసుల కట్టడికి కొన్ని ఆంక్షలను విధించింది.

corona control restrictions : కరోనా నియంత్రణకు టీ.సర్కార్ ఆంక్షలు…మాస్క్ లు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు

Mask Telangana

telangana govt restrictions for corona control : కరోనా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కేసుల కట్టడికి కొన్ని ఆంక్షలను విధించింది. మాస్కులను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీచేసింది. గతంలోనే ఈ ఆదేశాలు ఉన్నప్పటికీ చాలామంది మాస్కులు ధరించడం లేదు. దీంతో మాస్కులను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీచేసింది.

హోలీ, ఉగాది, రంజాన్‌, గుడ్‌ఫ్రైడే, శ్రీరామనవమిపై ఆంక్షలు విధించింది. ర్యాలీలు, యాత్రలపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విదించింది. ఏప్రిల్‌ 30 వరకు సామూహిక కార్యక్రమాలకు అనుమతి నిరాకరించింది.

తెలంగాణలో గడిచిన 24గంటల్లో 495 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా కోవిడ్‌తో ఇద్దరు మరణించారు. గ్రేటర్‌లో అత్యధికంగా 142కేసులు, మేడ్చల్‌లో 45, రంగారెడ్డిలో 35 కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3లక్షల 5వేల 804కు చేరుకోగా.. మరణాల సంఖ్య 16వందల 85కు పెరిగింది.

రాష్ట్రంలో ప్రస్తుతం 4వేల 241యాక్టివ్‌ కేసులు ఉండగా..వారిలో 18వందల 70మంది హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. కరోనా బారిన పడుతున్న వారిలో అత్యధికంగా 21ఏళ్ల నుంచి 40ఏళ్ల మధ్య వయస్సు వారే ఉన్నారు.