Vijaya Shanthi: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై విజయశాంతి ట్వీట్.. క్లారిటీ వచ్చేసినట్లేనా?

టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్‌లో ఎదుర్కుంటున్న పరిణామాలపై సోషల్ మీడియాలో నా స్పందన చూసి, బీజేపీలోనూ రాష్ట్ర నాయకత్వ మార్పు అని అసంబద్ధ ఊహాగానాలు కొందరు బీజేపీ వ్యతిరేకులు లేవనెత్తుతున్నారు.

Vijaya Shanthi: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై విజయశాంతి ట్వీట్.. క్లారిటీ వచ్చేసినట్లేనా?

Vijaya Shanthi: తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను మారుస్తారని జరుగుతున్న ప్రచారంపై ఆ పార్టీ సీనియర్ నేత విజయశాంతి స్పందించారు. ఈ ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను మార్చడం లేదని, ఆయన నాయకత్వంలోనే పార్టీ ఎన్నికలకు వెళ్తుందని విజయశాంతి స్పష్టం చేశారు.

Telangana: తెలంగాణను వణికిస్తున్న చలి.. సాధారణంకన్నా 3-5 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు

అయితే, విజయశాంతి ఇలా స్పందించడానికి కారణం ఉంది. ఇటీవల ఆమె ఒక అంశంపై మాట్లాడారు. అవసరమైతే అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడానికి సిద్ధమేనని ఒక సందర్భంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై విజయశాంతి స్పందించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో ఎదుర్కొంటున్న పరిణామాల గురించి, దీనికి సంబంధించి నాయకత్వ మార్పు గురించి ఆమె స్పందించారు. కానీ, ఈ అంశం వివాదాస్పదమైంది. కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాల గురించి విజయశాంతి ఎందుకు స్పందిస్తారని, ఆమె బీజేపీలో నాయకత్వ మార్పు గురించే పోస్ట్ చేసి ఉంటుందని ప్రచారం జరిగింది. ఆమె అభిప్రాయం తప్పుగా జనాల్లోకి వెళ్లడంతో దీనిపై క్లారిటీ ఇచ్చారు విజయశాంతి.

Chandrababu-Pawan Kalyan Meeting : చంద్రబాబు, పవన్ భేటీతో వేడెక్కిన ఏపీ పాలిటిక్స్.. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయనున్నాయా?

ఈ అంశంపై ట్వీట్ చేస్తూ.. తాను కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ మార్పు గురించి స్పందించానని, అయితే, కొందరు బీజేపీలోనూ నాయకత్వ మార్పు అంటూ అసంబద్ధ ఊహాగానాలు ప్రచారం చేస్తున్నారని ఆమె ట్వీట్ చేశారు. ‘‘టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్‌లో ఎదుర్కుంటున్న పరిణామాలపై సోషల్ మీడియాలో నా స్పందన చూసి, బీజేపీలోనూ రాష్ట్ర నాయకత్వ మార్పు అని అసంబద్ధ ఊహాగానాలు కొందరు బీజేపీ వ్యతిరేకులు లేవనెత్తుతున్నారు. ఈ అంశంపై మా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్, తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి సైతం స్పష్టతనిచ్చారు.

తెలంగాణ బీజేపీ నాయకత్వంలో మార్పు ఉండదని స్పష్టం చెయ్యడమే గాక ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రస్తుత టీంతో, బండి సంజయ్ నేతృత్వంలోనే యుద్ధానికి సిద్ధమని తేల్చి చెప్పారు. అరకొర సమాచారాన్ని నమ్మి చిలవలు పలవలు చేసి ప్రచారం చేసేవారికి ఇంతకు మించి చెప్పాల్సిందేమీ లేదు. రేపటి విజయం బీజేపీది, ఫలితం తెలంగాణ ప్రజలందరిదీ… జై శ్రీరాం’’ అని విజయశాంతి ట్వీట్ చేశారు.