YS Sharmila : ‘బీఆర్ఎస్’ అంటే ‘బంధిపోట్ల-రాష్ట్ర-సమితి’ : వైఎస్ షర్మిల

దళితులపై జరుగుతున్న అన్యాయంపై, దళితుల న్యాయమైన హక్కుల కోసం YSRTP పోరాడుతుందన్నారు.

YS Sharmila : ‘బీఆర్ఎస్’ అంటే ‘బంధిపోట్ల-రాష్ట్ర-సమితి’ : వైఎస్ షర్మిల

YS Sharmila (1) (1)

YS Sharmila Criticize BRS  : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. బీఆర్ఎస్, కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘బీఆర్ఎస్’ అంటే ‘బంధిపోట్ల-రాష్ట్ర-సమితి’ అని ఊరికే అనలేదన్నారు. నడిరోడ్డుపై దళిత న్యాయవాది కారు అద్దాలు పగలగొట్టి.. రక్తమోడేలా దాడి చేసి.. చంపేస్తామంటూ బెదిరించడం బంధిపోట్లకే సాధ్యమన్నారు. దళితబంధు అక్రమాలను ఎత్తిచూపిన అడ్వకేట్ యుగేందర్ మీద బీఆర్ఎస్ గూండాల దాడిని YSRTP తీవ్రంగా ఖండిస్తుందని వైఎస్ షర్మిల తెలిపారు.

దళితులపై జరుగుతున్న అన్యాయంపై, దళితుల న్యాయమైన హక్కుల కోసం YSRTP పోరాడుతుందన్నారు. బంధిపోట్ల రాష్ట్ర సమితి అంటే తనపై హుటాహుటిన కేసు నమోదు చేయించిన కేసీఆర్.. దళిత న్యాయవాదిపై దాడికి దిగిన బీఆర్ఎస్ బంధిపోట్లకు మాత్రం గొడుగు పడుతున్నారని విమర్శించారు. దళిత ముఖ్యమంత్రి నుంచి దళితబంధు వరకు అన్ని రకాలుగా మోసం చేసిన మోసగాడు కేసీఆర్ అని వ్యాఖ్యానించారు.

Minister Kishan Reddy: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు.. కవిత అరెస్టు విషయంపై కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

కేసీఆర్ సొంత రాజ్యాంగంలో ప్రతిపక్షాలకు పోరాడే హక్కు లేదని, మీడియాకు ప్రశ్నించే స్వేచ్ఛ లేదన్నారు. ప్రజలకు న్యాయం లేదు.. న్యాయవాదులకు రక్షణ లేదు.. బంధిపోట్ల దాష్టీకాలకు అడ్డూఅదుపూ లేదని పేర్కొన్నారు. అందుకే టీఆర్ఎస్ అంటే తాలిబన్ల రాష్ట్ర సమితి అని, బీఆర్ఎస్ అంటే బంధిపోట్ల రాష్ట్ర సమితి అని అన్నామని స్పష్టం చేశారు.