24 నుంచి టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు.. సబ్జెక్టుల వారిగా తేదీలు ఇవే..

ఏపీలో పదవ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనె 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 6వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించబోతున్నట్లు

24 నుంచి టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు.. సబ్జెక్టుల వారిగా తేదీలు ఇవే..

AP SSC Supplementary Exam 2024

Updated On : May 21, 2024 / 9:00 AM IST

AP SSC Supplementary Exam 2024 : ఏపీలో పదవ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనె 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 3వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించబోతున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు మొత్తం 1.61, 877లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 96,938 మంది బాలురు, 64,939 మంది బాలికలు ఉన్నారు. వీరు పరీక్షలు రాసేందుకు 684 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.

Also Read : UP Prisoners 10th Examination : 10th,ఇంటర్ పరీక్షలు రాసిన ఖైదీలు .. 95 శాతం మంది ఉత్తీర్ణత

పరీక్షలు ప్రతీరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరగనున్నాయి. అయితే, సైన్స్ (ఫిజిక్స్, బయోలాజికల్) పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి ఉదయం 11.30 గంటల వరకు నిర్వహించనున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఉదయం 8.45 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్స్ ఇప్పటికే అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచిన విషయం తెలిసిందే. విద్యార్థులు తమ పేరు, జిల్లా, పాఠశాల, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి నేరుగా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Also Read : Fish Prasadam : బత్తిని ఫ్యామిలీ చేప ప్రసాదం.. పంపిణీ తేదీ ఎప్పుడు.. ఎక్కడంటే?

పరీక్షల తేదీలు..
మే24 – ఫస్ట్ లాంగ్వేజ్
మే25 – సెకండ్ లాంగ్వేజ్
మే27 – ఇంగ్లీష్
మే28 – మాథమెటిక్స్
మే29 – ఫిజికల్ సైన్స్
మే30 – బయోలాజికల్ సైన్స్
మే31 – సోషల్ స్టడీస్
జూన్ 1 – ఓఎస్ఎస్సీ పేపర్ -1
జూన్ 3 – ఓఎస్ఎస్సీ పేపర్ -2

AP SSC Supplementary Exam time table

AP SSC Supplementary Exam time table