CM Jagan ATC Tires Unit : రేపు అచ్యుతాపురంలో సీఎం జగన్ పర్యటన.. ఏటీసీ టైర్ల పరిశ్రమ ప్రారంభోత్సవం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో పర్యటించనున్నారు. ఉదయం 10.20 గంటలకు సీఎం జగన్ విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి అచ్యుతాపురం బయలుదేరతారు. అక్కడ ఏటీసీ టైర్ల పరిశ్రమను ప్రారంభించనున్నారు.

CM Jagan ATC Tires Unit : రేపు అచ్యుతాపురంలో సీఎం జగన్ పర్యటన.. ఏటీసీ టైర్ల పరిశ్రమ ప్రారంభోత్సవం

Updated On : August 15, 2022 / 10:05 PM IST

CM Jagan ATC Tires Unit : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో పర్యటించనున్నారు. ఉదయం 10.20 గంటలకు సీఎం జగన్ విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి అచ్యుతాపురం బయలుదేరతారు. అక్కడ ఏటీసీ టైర్ల పరిశ్రమను ప్రారంభించనున్నారు.

జపాన్ కు చెందిన యోకహామా గ్రూప్ నకు చెందిన ఏటీసీ టైర్ల పరిశ్రమను ఇక్కడి సెజ్ లో ఏర్పాటు చేశారు. రూ.2,350 కోట్ల వ్యయంతో ప్లాంట్ నిర్మిస్తున్నారు. ఇందులో తొలి యూనిట్ సిద్ధం కాగా, సీఎం జగన్ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. ఏటీసీ టైర్ల తయారీ కంపెనీ ద్వారా దాదాపు 2వేల మంది స్థానికులకు ఉపాధి లభించనుంది.

100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న యోకహామా కంపెనీ 6 ఖండాల్లో 120 దేశాల్లో విస్తరించి ఉంది. మన దేశంలో ఇప్పటికే తమిళనాడులోని తిరునల్వేలి, గుజరాత్‌లోని దహేజ్‌లో ఏటీసీ టైర్ల మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్లను నెలకొల్పింది. అచ్యుతాపురం యూనిట్‌ మూడోది.

ఇక ఏపీ సెజ్ ప్రాంగ‌ణంలో సీఎం జ‌గ‌న్ ప‌లు నూత‌న యూనిట్లకు భూమి పూజ చేయ‌నున్నారు. ఇందులో ఏటీసీ టైర్స్‌ ఏపీ ప్రైవేట్‌ లిమిటెడ్ ఒకటి. వాటర్‌ ప్రూఫింగ్‌ ఉత్పత్తుల తయారీ, కోటింగ్, సీలెంట్స్‌ తదితర ఉత్పత్తుల తయారీ యూనిట్‌ విస్తరణకు సీఎం జగన్ భూమి పూజ చేయనున్నారు. మేఘ ఫ్రూట్‌ ప్రాసెసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, కార్బొనేటెడ్‌ ప్రూట్‌ డ్రింక్స్, ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్, ప్రూట్‌ జ్యూస్‌ల టెట్రా ప్యాకింగ్, పెట్‌ బాటిల్స్‌ తదితర ఉత్పత్తుల బెవరేజెస్‌ యూనిట్‌ను సెజ్ లో నెలకొల్పనున్నారు. ఇప్పటికే మంగళూరు, సంగారెడ్డిలలో యూనిట్లు ఉన్న ఈ కంపెనీ అచ్యుతాపురం సెజ్‌లో రూ. 185.25 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దాదాపు 700 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు.