హ్యాపీ డే సార్ : చంద్రబాబుకి పెళ్లి రోజు శుభాకాంక్షలు

ఏపీ మాజీ సీఎం, ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబునాయుడు పెళ్లి రోజు ఇవాళ. పెళ్లి జరిగి సెప్టెంబర్ 10వ తేదీకి 39 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు బాబు. ఈ సందర్భంగా ప్రముఖులు అందరూ ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. జీవితంలో మరిన్ని పెళ్లి రోజులు జరుపుకోవాలని.. ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అభిమానులు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు అధినేతకు.
1981 సెప్టెంబర్ 10వ తేదీన ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరితో ఆయనకు వివాహం జరిగింది. ఉదయం 8 గంటల 6 నిమిషాలకు చెన్నైలోని మౌంట్ రోడ్డులోని గవర్నమెంట్ లో ఎస్టేట్ కలైవాసర ఆరంగంలో ఈ వేడుక జరిగింది. అప్పటికే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ, పరిశ్రమలు, పురావస్తు శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పెళ్లిరోజుకి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మంత్రిగా ఉన్నారు. చంద్రబాబు చురుకుదనం, విజన్ నచ్చిన మహానటుడు ఎన్టీఆర్.. కుమార్తెనిచ్చి వివాహం చేశారు.
చంద్రబాబు – భువనేశ్వరి ఏకైక కుమారుడు, మాజీ మంత్రి అయిన లోకేష్ కూడా స్పందించారు. ట్విట్టర్ లో శుభాకాంక్షలు చెప్పారు తల్లిదండ్రులకు. ఈరోజు అమ్మానాన్నల పెళ్ళిరోజు. సహధర్మచారిణి అన్న పదాన్ని నాన్నగారి జీవితంలో నిజం చేస్తూ ఆయన ఆశయాల్లో, ఆలోచనల్లో తోడుగా నిలుస్తానంటూ చేయిపట్టి అమ్మ ఏడడుగులు నడిచిన రోజు. ఆ ఆదర్శ దంపతులు సుఖసంతోషాలతో నూరేళ్ళు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ పెళ్లిరోజు శుభాకాంక్షలు అంటూ ఆనందాన్ని పంచుకున్నారు.
ఈరోజు అమ్మానాన్నల పెళ్ళిరోజు. సహధర్మచారిణి అన్న పదాన్ని నాన్నగారి జీవితంలో నిజం చేస్తూ ఆయన ఆశయాల్లో, ఆలోచనల్లో తోడుగా నిలుస్తానంటూ చేయిపట్టి అమ్మ ఏడడుగులు నడిచిన రోజు. ఆ ఆదర్శ దంపతులు సుఖసంతోషాలతో నూరేళ్ళు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ పెళ్లిరోజు శుభాకాంక్షలు. pic.twitter.com/3bRyA1SVK7
— Lokesh Nara (@naralokesh) September 10, 2019