AP Corona Cases : ఏపీలో కొత్తగా 220 కరోనా కేసులు

రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 220 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు కోవిడ్ తో చనిపోయారు.

AP Corona Cases : ఏపీలో కొత్తగా 220 కరోనా కేసులు

Ap Corona Cases

Updated On : February 24, 2022 / 8:11 PM IST

AP Corona Cases : ఏపీలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 17వేల 735 కరోనా పరీక్షలు నిర్వహించగా 220 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 43, కృష్ణా జిల్లాలో 40, గుంటూరు జిల్లాలో 36, తూర్పు గోదావరి జిల్లాలో 27 కొత్త కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 472 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో ఇద్దరు కోవిడ్ తో చనిపోయారు. చిత్తూరు, కృష్ణా జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,17,184 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 22,97,537 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో 4వేల 927 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 14వేల 720కి పెరిగింది. రాష్ట్రంలో నేటి వరకు 3,30,47,859 కరోనా టెస్టులు చేశారు. క్రితం రోజుతో(253) పోలిస్తే కొత్త కేసులు తగ్గాయి.

AP Corona Cases : ఏపీకి బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గిన కరోనా కేసులు

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉంది. బుధవారం 11 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 14వేల 148 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ముందురోజు కంటే కేసులు 6శాతం తగ్గాయి. పాజిటివిటీ రేటు 1.22 శాతానికి క్షీణించింది. 24 గంటల వ్యవధిలో మరో 302 మంది కోవిడ్ తో ప్రాణాలు కోల్పోయారు. 2020 జనవరి నుంచి 4.28 కోట్ల మందికి కరోనా సోకగా.. 5,12,924 మరణాలు సంభవించాయి.

వైరస్ వ్యాప్తి కట్టడిలో ఉండటంతో యాక్టివ్ కేసులు 1,48,359(0.35 శాతం)కి పడిపోయాయి. నిన్న ఒక్కరోజే 30 వేల మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 4.22 కోట్లు దాటింది. రికవరీ రేటు 98.46 శాతానికి పెరిగింది. ఇక నిన్న 30 లక్షల మంది టీకా తీసుకోగా.. 13 నెలల వ్యవధిలో 176 కోట్లకుపైగా డోసులు పంపిణీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది.