AP Assembly: టీడీపీ ఎమ్మెల్యేలకు రెండ్రోజుల సస్పెన్షన్
ఏపీలో టీడీపీ సభ్యులు వరుసగా రెండో రోజూ చర్చనీయాంశంగా మారాయి. మంగళవారం శాసన మండలి సమావేశాల్లో ఉండగా ఈల వేసి గోల చేశారు.

Ap Assembly
AP Assembly: ఏపీలో టీడీపీ సభ్యులు వరుసగా రెండో రోజూ చర్చనీయాంశంగా మారాయి. మంగళవారం శాసన మండలి సమావేశాల్లో ఉండగా ఈల వేసి గోల చేశారు. బుధవారం మరోసారి చిడతలు వాయించుకుంటూ నానా రచ్చ చేశారు. స్పీకర్ తమ్మినేని వద్దని వారించినా వినిపించకపోవడంతో వాటి లాక్కోవాలని సిబ్బందిని ఆదేశించారు.
ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు.. టీడీపీపై వ్యక్తిగతంగా విమర్శలకు దిగారు. ఈ గందరగోళానికి కారణమైన ఐదుగురు ఎమ్మల్యలేలను సస్పెండ్ చేశారు స్పీకర్ తమ్మినేని. వారి వివరాలిలా ఉన్నాయి.
- గొట్టిపాటి రవి,
- ఆదిరెడ్డి భవానీ,
- నిమ్మకాలయ్య చినరాజప్ప
- పీజేవీ నాయుడు.
- జోగశ్వరరావులను రెండు రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ఆదేశించారు.