ఎవరైనా కుట్రలకు పాల్పడితే ఊరుకునేది లేదు: బాలినేని హెచ్చరిక
Balineni Srinivasa Reddy: ఒంగోలులో 25 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే అడ్డుకోవటానికి ప్రయత్నించడం సరికాదని బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు.

Balineni Srinivasa Reddy
ఇళ్ల పట్టాలకు సంబంధించిన విషయాలపై కొందరు ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారని ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. పట్టాల మంజూరులో ఎవరైనా కుట్రలకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ఇవాళ బాలినేని మీడియాతో మాట్లాడుతూ.. ఒంగోలులోని పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలనేది తన కోరిక అని చెప్పుకొచ్చారు. ఇక్కడి నివాస స్థలాల విషయంలో అక్రమాలకు పాల్పడితే చెప్పుతో కొట్టాలన్నారు. ఎన్ని కేసులైనా తనపై పెట్టుకోవచ్చని చెప్పారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో మాత్రం తాను వెనక్కి తగ్గబోమని అన్నారు.
ఒంగోలులో 25 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే అడ్డుకోవటానికి ప్రయత్నించడం సరికాదని బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. సీఎం జగన్ చేతుల మీదుగా ఫిబ్రవరి 25లోగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. తన రాజకీయ జీవితాన్ని పేదల ఇళ్ల పట్టాల కోసం త్యాగంగా పెట్టానని చెప్పారు.
దేనికి సిద్ధం..? జైలుకి వెళ్లడానికా? సీఎం జగన్ పై నారా లోకేశ్ నిప్పులు