శ్రీశైలం ఆలయ పవిత్రను కాపాడకపోతే ఈఓపై దాడి చేస్తాం : బీజేపీ నేత బుడ్డా శ్రీకాంత్ రెడ్డి

శ్రీశైలం ఆలయ పవిత్రను కాపాడకపోతే ఈఓపై దాడి చేస్తాం : బీజేపీ నేత బుడ్డా శ్రీకాంత్ రెడ్డి

Updated On : December 22, 2020 / 4:16 PM IST

Budda Srikanth Reddy sensational on Srisailam EO : శ్రీశైలంలో అన్యమతస్థుల ప్రమేయం ఎక్కువైపోయిందని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం ఈఓపై బీజేపీ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ బుడ్డా శ్రీకాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆలయ పవిత్రను కాపాడకపోతే ఈఓపై దాడి చేస్తామని హెచ్చరించారు.

ఆలయ ఈఓ అన్యమతస్థులకు తొత్తుగా మారారని విమర్శించారు. ముస్లీం పెత్తనం లేకుండా చేయాలని, లేకుంటే త్వరలో చలో శ్రీశైలం ప్రొగ్రాం చేపడతామని తెలిపారు. ఈఓపై దాడితోపాటు విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరించారు. తమ దేవాలయాన్ని, తమ ధర్మాన్ని తాము రక్షించుకుంటామన్నారు.

ఎవరి పెత్తనంతో అధ్యాత్మిక చింతన చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ముస్లీం కింద తాము పూజలు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇది తమ ధర్మానికి విరుద్ధమని పేర్కొన్నారు. ఇప్పటికే శ్రీశైలంలో అన్యమతస్థుల కలకలం చెలరేగుతున్న వేళ బీజేపీ నేతల వ్యాఖ్యలపై మరింత టెన్షన్ నెలకొంది.