టీచర్ల బదిలీలపై ఆరోపణలు.. బొత్స సత్యనారాయణ ఫైర్

Botsa Satyanarayana: కొందరు అసత్యాలు సృష్టిస్తూ తన వ్యక్తిత్వ హననానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు.

టీచర్ల బదిలీలపై ఆరోపణలు.. బొత్స సత్యనారాయణ ఫైర్

Botsa Satyanarayana

Updated On : June 7, 2024 / 2:54 PM IST

టీచర్ల బదిలీల గురించి తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాల విద్యా శాఖ పరిధిలో గతంలో జరిగిన టీచర్ల బదిలీల నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయం గతంలోదేనని అన్నారు.

కొందరు అసత్యాలు సృష్టిస్తూ తన వ్యక్తిత్వ హననానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. కొందరు టీచర్లు వారి ఇబ్బందులు, వ్యక్తిగత సమస్యల వల్ల బదిలీల కోసం అర్జీ పెట్టుకున్నారని చెప్పారు. వాటిని పూర్తి పారదర్శకంగా పరిశీలించి క్షేత్ర స్థాయి నుంచి నివేదికలు తెప్పించుకున్న తర్వాతే అప్పట్లో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఫలితాలు వెలువడిన వెంటనే ఈ బదిలీలు నిలిపేయాల్సింది తానే సంబంధిత అధికారులను కోరానన్నారు.

ఇప్పుడు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వస్తున్న నేపథ్యంలో దీనిపై వారు వారికి నచ్చిన నిర్ణయం తీసుకోవచ్చని చెప్పారు. టీచర్ల సమస్యలను పరిగణనలోకి తీసుకుంటారా? లేదా? అన్నది వారి ఇష్టమని తెలిపారు. వాస్తవాలు ఇలా ఉంటే బదిలీల కోసం లంచాలు తీసుకున్నారంటూ తప్పుడు ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు.

Also Read: తిరుపతి ఎంపీ స్థానంలో ఓటమిపై బీజేపీ అభ్యర్థి వరప్రసాదరావు భావోద్వేగం