అమరావతిని చంపేయాలని చూస్తున్నారు : జీఎన్ రావు కమిటీ నివేదికపై చంద్రబాబు సీరియస్
ఏపీ రాజధాని అంశంపై జీఎన్ రావు కమిటీ ప్రభుత్వానికి చేసిన సిఫార్సులపై మాజీ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ పాలకులు

ఏపీ రాజధాని అంశంపై జీఎన్ రావు కమిటీ ప్రభుత్వానికి చేసిన సిఫార్సులపై మాజీ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ పాలకులు
ఏపీ రాజధాని అంశంపై జీఎన్ రావు కమిటీ.. ప్రభుత్వానికి చేసిన సిఫార్సులపై మాజీ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. వైసీపీ పాలకులు అమరావతిని నాశనం చేస్తున్నారని వాపోయారు. అవినీతి పేరుతో అమరావతిని చంపేయాలని చూస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై సీఎం జగన్ ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులను సీఎం జగన్ క్షోభకు గురి చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల త్యాగాలను అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు.
నేను తీసుకొచ్చిన కంపెనీలను సీఎం జగన్ తరిమేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. మూడు కాకపోతే 30 రాజధానులు పెడతామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు తప్పుపట్టారు. 30 రాజధానులు పెట్టడానికి ఇదేమైనా మీ జాగీరా? అని ప్రశ్నించారు.
రాజధానిపై ఏర్పాటైన జీఎన్ రావు కమిటీ.. సీఎం జగన్ కి నివేదిక అందజేసింది. పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రాన్ని నాలుగు రీజియన్ లుగా చేయాలని నివేదికలో సిఫార్సు చేసింది. మూడు ఉత్తరాంధ్ర జిల్లాలతో నార్త్ కోస్టల్ రీజియన్, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలతో సెంట్రల్ కోస్టల్ రీజియన్.. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జల్లాలతో సౌత్ కోస్టల్ రీజియన్.. నాలుగు రాయలసీమ జిల్లాలతో రాయలసీమ రీజియన్ ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది.
ఇక విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని జీఎన్ రావు కమిటీ సిఫార్సు చేసింది. విశాఖలో సచివాలయం, హైకోర్టు బెంచ్, సీఎంవో, వేసవిలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని సిఫారసు చేసింది. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం.. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంది. అమరావతిలో అసెంబ్లీ కొనసాగించి, నదికి దూరంగా ఉన్న మంగళగిరి ప్రాంతంలో పాలన భవనాలు ఏర్పాటు చేయాలని కమిటీ ప్రతిపాదించింది. అమరావతి ప్రాంతంలో హైకోర్టు బెంచ్, మంత్రుల క్వార్టర్స్, రాజ్ భవన్ ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. సీఎం క్యాంప్ ఆఫీస్ అమరావతిలోనే ఉండనుంది.