Chandrababu Naidu: టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్‌లోనూ ఇలాంటి స్టోరీ ఉండదు: చంద్రబాబు

గత ఎన్నికల్లో సానుభూతితో జగన్ కు ఓట్లు పడ్డాయని చంద్రబాబు అన్నారు.

Chandrababu Naidu: టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్‌లోనూ ఇలాంటి స్టోరీ ఉండదు: చంద్రబాబు

Chandrababu Naidu Slams YS Jagan

Updated On : December 30, 2023 / 9:58 PM IST

టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్‌లోనూ బాబాయ్ హత్య లాంటి స్టోరీ ఉండదంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ముందు గుండె పోటు అని మొదటి చెప్పారని విమర్శించారు. చివరికి గొడ్డలి పోటుగా తేలిందని అన్నారు. చివరికి నారావారి రక్తచరిత్ర అంటూ నిందలు వేశారని చంద్రబాబు అన్నారు.

చిత్తూరు జిల్లాలోని కుప్పం మల్లనూరు సభలో చంద్రబాబు ప్రసంగించారు. గత ఎన్నికల్లో సానుభూతితో జగన్ కు ఓట్లు పడ్డాయని చంద్రబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటర్లు ఏమరుపాటుగా ఉంటే మళ్లీ సమస్యలు వస్తాయని చెప్పారు. తాను ఈ సారి కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తానని అన్నారు.

జగన్ తన పాలనలో జాబ్ క్యాలెండర్‌ విడుదల చేశారా? అని ప్రశ్నించారు. పాఠశాల భవనాలకు పెయింటింగ్ వేస్తే విద్యా వ్యవస్థను మార్పు చేసినట్లా అని మండిపడ్డారు. కుప్పంలోను గూండాయిజం చేస్తున్నారని చెప్పారు. ఏపీలో నిత్యావసర సరుకుల నుంచి విద్యుత్ చార్జీల వరకు అన్నీ పెరిగిపోయాయన్నారు.

Balakrishna: హైదరాబాద్‌లో రేవంత్ రెడ్డితో నందమూరి బాలకృష్ణ భేటీ