రాజధాని..చంద్ర నిప్పులు : కావాలనే డబ్బులు లేవంటున్నారు

అమరావతి రాజధానిపై వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నిప్పులు చెరుగుతున్నారు. డిసెంబర్ 27వ తేదీ శుక్రవారం కేబినెట్ మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాలపై ఆయన తప్పు బట్టారు. రాజధాని నిర్మాణానికి అంత డబ్బులు లేదని చెబుతున్న పాలకులు..ఇప్పుడు ఎక్కడి నుంచి పాలిస్తున్నారని ప్రశ్నించారు. డబ్బులు ఎందుకు అవసరం ?
వేరే ప్రదేశానికి వెళితే..హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ కట్టాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం ఏడు నెలలు పరిపాలన చేశారు కదా..ఎక్కడ కూర్చొన్నారని నిలదీశారు. సంపద ఎలా సృష్టిస్తారో తెలుసా ? ముందు అభివృద్ధి..తర్వాత..సంపాదన..అనంతరం ఆదాయం వస్తుందన్నారు. ఇన్ సైడ్ ట్రేడ్ జరిగిందంటూ ఒకవైపు..వరదలు వస్తే..మునిగిపోతుందని, ఫౌండేషన్ కోసం ఎక్కువ ఖర్చు చేశారని..అసైన్డ్ ల్యాండ్‌లో అవకతవకలు జరిగాయంటూ..ఏవోవో మాట్లాడుతున్నారని వైసీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
65 శాతం ఆదాయం హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి వస్తుందని, ఒక్క రిజిస్ట్రేషన్ ఛార్జీల నుంచి రూ. 10 వేల కోట్ల రూపాయలు వస్తుందని అంచనా వేశారని తెలిపారు. అందుకే తాము ల్యాండ్ పూలింగ్ విధానం ముందుకు తీసుకొచ్చామన్నారు. స్వచ్చందంగా 29 వేల మంది 33 వేల ఎకరాల భూమి ఇచ్చారన్నారు. తిరిగి డిఫెరేంట్ కేటగిరీ కింద..అందరికీ ఆమోదయోగ్యంగా ఇంటి జాగా, కమర్షియల్ జాగాలు ఇవ్వడం జరిగిందన్నారు.
Read More : సీఎం, మంత్రిని అడుగుతున్నా : ఎంతెంత ఖర్చు చేశామంటే..బాబు లెక్కలు